Eega: సంవత్సరాలు, తరాలు గడిచినా కొన్ని సినిమాలను మర్చిపోలేం. అలాంటి వాటిలో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ కూడా ‘ఈగ’ ఒకటి. డైరెక్టర్‌గా జక్కన్న అప్పటివరకు చేసిన సినిమాలు ఒక ఎత్తైతే.. ఈ ‘ఈగ’ మరో ఎత్తు..
‘యమదొంగ’ తో సోషియో ఫాంటసీ, ‘మగధీర’ తో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్స్‌ని టచ్ చేసి సరికొత్తగా ప్రజెంట్ చేసిన రాజమౌళి ‘ఈగ’ తో పెద్ద ప్రయోగమే చేశారు. తెలుగు తెరకి టెక్నాలజీలోని మరిన్ని మెళకువల్ని పరిచయం చేశారు. 2012 జూలై 6న విడుదలైన ‘ఈగ’.. 2022 జూలై 6 నాటికి పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది.
నేచురల్ స్టార్ నాని, సమంత మెయిన్ లీడ్స్‌గా.. స్నేహితుడు సాయి కొర్రపాటిని నిర్మాతగా తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తూ.. జక్కన్న చేసిన విజువల్ వండర్ ‘ఈగ’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఆడియన్స్‌కి థ్రిల్ కలిగించాయి. ‘ఈగ’ రివేంజ్ తీర్చుకోవడాన్ని ప్రేక్షకులంతా ఓన్ చేసుకున్నారు.
తమిళ్లో Naan Ee, హిందీలో Makkhi పేర్లతో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘కిచ్చా’ సుదీప్‌ని టాలీవుడ్‌కి తీసుకొచ్చారు. నాని, సమంత, సుదీప్‌ల నటన ఆకట్టుకుంది. ‘ఈగ’ క్యారెక్టర్ డిజైన్ నుండి సినిమాగా తీసుకురావడానికి జక్కన్న చాలా కష్టపడ్డారు. కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్, సెంథిల్ కుమార్ విజువల్స్, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ సినిమాకు ప్లస్ అయ్యాయి. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ విలన్, బెస్ట్ స్క్రీన్‌ప్లే, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఎడిటర్ కేటగిరీల్లో నంది అవార్డులతో పాటు పలు అవార్డులు ‘ఈగ’ ను వరించాయి.
Leave a comment