లావుగా, మరీ ఎత్తుగా ఉన్నా తనకి తగ్గ హీరోలతో చేస్తూ.. అటు గ్లామర్ పాత్రలతో పాటు, చారిత్రాత్మక పాత్రలు కూడా చేస్తూ తనకంటూ మంచి స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది ఈ మంగళూర్ అమ్మాయి. తుళు మాట్లాడే ఇంట్లో పుట్టిన అనుష్క పూరీ జగన్నాథ్ 2005 లో తీసిన సూపర్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది. ఆ తర్వాతి సంవత్సరమే రాజమౌళి డైరెక్ట్ చేసిన విక్రమార్కుడు సినిమాలో అవకాశం సంపాదించి ఫాన్స్ ని సంపాదించుకుంది. ఇక అక్కడినుంచి తను వెనక్కి తిరిగి చూసుకోలేదు. లక్ష్యం, శౌర్యం, చింతకాయల రవి, అరుంధతి, సైజ్ జీరో, రుద్రమదేవి, మిర్చి ఇలా అన్నిటికన్నా ముఖ్యంగా బాహుబలి వంటి సినిమాలో నటించింది.
తెలుగులో మాత్రమే కాకుండా, అటు తమిళ్ లోనూ చాలా సినిమాల్లో నటించిన అనుష్క కేవలం పెద్ద పెద్ద హీరోలతో మాత్రమే ఆక్ట్ చేసి.. లేడీ సూపర్ స్టార్ గా భావించబడింది. తన సినిమాలన్నీ కలిపి 50 దాకా ఉంటాయి. తెలుగులో ముఖ్యంగా ప్రభాస్ జతగా నటించిన సినిమాలు బాగా పాపులర్ అయ్యాయి. ఆ ఇద్దరికీ సరైన జంటగా ఇప్పటికీ చెప్తారు. ఇద్దరూ 40 దగ్గరలో ఉండటం.. పెళ్లి చేసుకోకుండా ఉండటం.. వీళ్ళు ఎప్పటికైనా కలిసి ఉంటారనే ఆలోచనలకి కూడా ఊతం ఇస్తున్నాయి. కానీ అనుష్క ఈ విషయంపై ఎప్పుడూ మాట్లాడలేదు. తనకి తన బంధువులలోనే ఒకరికి ఇచ్చి పెళ్లి చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. కానీ, వాటిపై కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేదు.
అనుష్క మూవీస్ వైపు రాకముందు.. కంప్యూటర్ అప్లికేషన్స్ లో డిగ్రీ చేసింది. ఆ తర్వాత భరత్ ఠాకూర్ అనే వ్యక్తి దగ్గర ట్రైనింగ్ తీసుకుని యోగాలో ఎక్స్పర్ట్ కూడా అయిన ఆమె.. ఒక యోగా ట్రైనింగ్ సెంటర్ కూడా నడుపుతుందని టాక్. 2005 లో నాగార్జునకి జంటగా వచ్చిన స్వీటీ ఇప్పటికీ 16 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే 39 ఏళ్లు నిండిపోయిన అనుష్క ఎన్ని మూవీస్ చేస్తుందో, ఎలాంటి పాత్రల్ని ఎంచుకుంటుందో వేచి చూడాలి.
Leave a comment