రాజమౌళి తీసిన కొన్ని సినిమాల్లో సింహాద్రి ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజుల్లోనూ తన నట విశ్వరూపం చూయించారు. 191 సెంటర్లలో 50 రోజులు ఆడి, 150 సెంటర్లలో 100 రోజులు ఆడి అప్పటిదాకా చిరంజీవి పేరు మీద, బాలకృష్ణ పేరు మీద ఉన్న రికార్డులని బ్రేక్ చేశాడు. అప్పట్లో ఈ మూవీ పెద్ద సంచలనం అయిందనే చెప్పాలి. 55 సెంటర్లలో 175 రోజులు, 15 సెంటర్లలో 200 రోజులు ఆడటం అంటే మామూలు విషయం కాదు.
అంతలా ఈ మూవీ ప్రేక్షకులని ఆకట్టుకుంది. రాజమౌళి పేరు కూడా అప్పటినుంచే మారుమోగడం మొదలైంది. తారక్ కెరీర్ ని ఒక్క సారిగా స్టార్ స్థాయికి తీసుకెళ్లింది. ఏకంగా ఆ రోజుల్లో 27 కోట్లు సంపాదించి చరిత్ర సృష్టించింది. ఈ మూవీ టైమ్లో తారక్ వయసు కేవలం 19. ఈ ట్రెండ్ సెట్టర్ కి నేటితో 18 ఏళ్లు.
Leave a comment