మన్యం ప్రొడక్షన్స్ వాళ్ళు నిర్మించిన ఈ సినిమా నేటితో రెండేళ్ళు పూర్తి చేసుకుంటుంది. వివేక్ ఆత్రేయ సినిమాని డైరెక్ట్ చేసాడు. 2019 జూన్ 28 న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. సినిమాని బాగా ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు రెండేళ్ళు ఐన సంధర్భంగా గుర్తు చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో. శ్రీ విష్ణు, నివేదా థామస్ లతో పాటు సత్యదేవ్, ప్రియదర్శి పులికొండ, రాహుల్ రామకృష్ణ కూడా నటించిన ఈ సినిమాకి చివరికి ఎంత డబ్బు వసూలు చేసిందో చూద్దాం..
ఏపీ, తెలంగాణా మొత్తంలో 5.41 కోట్లు రాగా, మిగిలిన రాష్ట్రాలలోని థియేటర్స్ లో 0.91 కోట్లు రాబట్టగలిగింది. మొత్తంగా సినిమాకి ఆరున్నర కోట్లు రావడం జరిగింది. కేవలం థియేటర్ ద్వారా 2.2 కోట్లు సంపాదించిన ఈ సినిమా నాలుగు కోట్లకు పైనే ఆదాయాన్ని తమ నిర్మాతలకు అందించింది.
Leave a comment