తమిళ్ లో ‘రాక్షసన్’ పేరుతో విడుదలైన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అక్కడ పెద్ద సంచలనంగా మారింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఒక అధ్బుతమైన కథతో చిన్న సినిమాగా మొదలై పెద్ద హిట్ గా మారిన ఆ మూవీని తెలుగులో రాక్షసుడు పేరుతో రీమేక్ చేశారు. అప్పటిదాకా యాక్షన్ సినిమాలతో బిజీగా గడిపేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఒక్కసారిగా రూటు మార్చి ఈ కథని ఎంచుకుని పొరపాటు చేయలేదని నిరూపించుకున్నాడు. సినిమా ఊహించిన దానికంటే పెద్ద హిట్ గా మారింది తెలుగులోనూ.
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేసిన ఈ మూవీ అంతా ఒక సైకో చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆత్మన్యూనతా భావంతో ఆడపిల్లలని ఎత్తుకెళ్తూ ఉండే అతన్ని సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసే హీరో ఎలా అంతమొందించాడు అనేది ప్రధాన కథాంశం. హీరోయిన్ ఒక స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నప్పటికీ.. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ ని ఎక్కువగా లేకుండా చూసుకున్నారు. చివరి దాకా బోర్ కొట్టించకుండా ప్రేక్షకుడిని అలరించడంలో సినిమా మంచి సక్సెస్ సాధించిందనే చెప్పాలి.
రామ్ కుమార్ కథ ఆధారంగా రమేష్ వర్మ స్క్రీన్ ప్లే రాసుకుని దర్శకత్వం వహించడం జరిగింది. 15 కోట్ల బడ్జెట్ తో చేసిన ఈ మూవీ.. తొలిరోజే 4 కోట్ల వరకు రాబట్టింది. మొదటి వీకెండ్ నాటికి దాదాపు 17 కోట్లు మొత్తంగా 23 కోట్ల వరకు రాబట్టి సినిమాని కొన్న వాళ్ళకి లాభాలని తెచ్చిపెట్టింది అన్నమాట. ఐతే, తమిళంలో మొదటి పార్ట్ మంచి సక్సెస్ అవడంతో.. రెండో పార్ట్ ని చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఐతే.. తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి.. ఆ మూవీని రాక్షసుడు 2 గా రీమేక్ చేసే అవకాశం ఉంది.
Leave a comment