తెలుగులో వచ్చిన అత్యుత్తమ ఆధ్యాత్మిక చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది శ్రీ మంజునాథ చిత్రం. చిరంజీవి శివుడిగా, అర్జున్ సర్జా-సౌందర్య జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సక్సెస్ గా కూడా నిలిచింది. కె. రాఘవేంద్ర రావ్ డైరెక్ట్ చేశారు. నారా జయశ్రీదేవి సినిమాని నిర్మించారు. సపోర్టింగ్ రోల్స్ లో అంబరీష్, సుమలత, ద్వారకీశ్ నటించారు. 22 జూన్ 2001 న ఒకేసారి తెలుగు, కన్నడ రెండు భాషలలో విడుదలైన ఈ సినిమాకి ఈ రోజుతో 20 ఏళ్లు గడిచాయి.
మంజు అంటే మంచు అని అర్థం కన్నడలో. హిమాలయాలలో ఉండే దేవుడని శివుడికి అదొక పేరుగా మారింది. ఆ పేరుతోనే కొలిచే ఒక ప్రాంతంలో నాస్తికుడిగా బ్రతుకుతున్న మంజునాథ (అర్జున్) మెల్లగా శివుడికి గొప్ప భక్తుడిగా ఎలా మారిపోయాడు అనేది కథాంశం. కాత్యాయనిగా నటించిన సౌందర్య మొదటినుంచే శివుడికి గొప్ప భక్తురాలిగా ఉంటూ.. మంజునాథ దేవుడిని తిట్టిన ప్రతిసారీ భర్త పరిస్తితిని చూసి చింతిస్తూ ఉంటుంది. అతను మారాలని దేవుడికి ప్రార్థిస్తూ ఉంటుంది. ఆమె కోరుకున్నట్టుగానే తన అనుభవాల ద్వారా దేవుడు ఉన్నాడని గ్రహిస్తాడు మంజునాథ.
అంబరీష్ అంబికేశ్వర మహారాజ్ లా, సుమలత సుమలతా దేవిగా ఇందులో కనిపిస్తారు. యమున గంగా దేవిలా ఈ సినిమాలో కనిపిస్తుంది. ఈ సినిమాలో పాటలు ఎంతో పాపులర్ అయ్యాయి. ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసిన వ్యక్తి హంసలేఖ. రెండు దశాబ్దాలు గడిచిన సంధర్భంగా ఈ సినిమాని మళ్ళీ ఒకసారి చూసి భక్తి పారవశ్యంలో మునిగిపోండి మరి.
Leave a comment