సరిగ్గా ఐదేళ్ల క్రితం కబాలి సెన్సేషన్ రజనీ ఫాన్స్ ని ఒక ఊపు ఊపింది. ఇంతకాలం ఎంతో మాస్ గా కనిపించిన రజనీకాంత్ ఒక్క సారిగా క్లాస్ గా కనిపించి ఫాన్స్ ని పండగ చేసుకునేలా చేశారు. ఆయనలో క్లాస్ ని చూడాలి అనుకున్నవాళ్ళ అందరి ఆశ ఒక్కసారిగా తీరిపోయింది. సినిమా కథ కూడా ప్రేక్షకులకి బాగా నచ్చింది. కానీ, ఎక్కడా ఫన్ కి రొమాన్స్ కి పెద్దగా చోటు ఇవ్వకపోవడంతో ఆశించినంత స్థాయిలో సినిమా లేదన్న కామెంట్స్ కూడా వచ్చాయి.
ఎంతో క్రేజీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో రిలీజ్ ఐన టీజర్, ట్రైలర్ ఫాన్స్ ని థియేటర్స్ కి రప్పించడంలో ఏ మాత్రం ఫెయిల్ కాలేదు. సుమారు 100 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ 700 కోట్ల పైనే వసూలు చేసిందని అంచనా. తమిళ సినిమాకి విదేశాల్లో కూడా మంచి మార్కెట్ ఉండటం ఇందుకు కారణం. పాన్ ఇండియా సినిమా పేరుతో మన తెలుగు వాళ్ళు కూడా దీన్ని సాధ్యం చేసుకునే ఆలోచనలో ఉన్నారు.
మలేషియాలో ఇరుక్కుపోయిన తమిళులకి లీడర్ గా పనిచేసే కబాలి ఎదురుతిరిగి ఎలా జైలుకి వెళ్ళాడు. తిరిగొచ్చి తనని మోసం చేసిన వాళ్ళ మీద ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది కథాంశం. ఈ పాత్రల్లో రజనీ అదరగొట్టాడనే చెప్పాలి.
Leave a comment