1953 జూన్ 26 న విడుదలైన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక సెన్సేషన్. తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా ‘దేవదాస్’ పేరుతో రిలీజ్ అయి అక్కడ కూడా మంచి హిట్ కొట్టింది. రెండు భాషల్లోనూ అనేక థియేటర్లలో 100 రోజులకి పైగా ఆడి ఒక గొప్ప సినిమాగా నిలిచిపోయింది. సినిమా చేసిన వసూళ్ళని పంచుకోవడంలో తగాదాలు అయ్యేంతగా సినిమా ఆడింది. 2002 లో జరిగిన 33 వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమాని చూపించడం ఒక విశేషం.
ఒక జమీందారు కొడుకైన దేవదాసు, తన చిన్నప్పటి స్నేహితురాలైన పార్వతిని ఇష్టపడతాడు. కానీ ఆమె కుటుంబ సభ్యులు ఆమెని మరో ఊరుకి చెందిన జమీందారుకి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకోవడంతో దేవదాసు అనుభవించిన బ్రేక్ అప్ ఎపిసోడ్ ఈ సినిమా. నాగేశ్వర రావు గారు తన నటనతో ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన ఎన్ని సినిమాలు చేసినా ఈ సినిమా మాత్రం ఆయన అన్ని సినిమాల్లో కెల్లా గొప్పదిగా పేరు తెచ్చుకుంది. ఇక మహానటి సావిత్రి గారు కూడా తన నటనతో సినిమా బిగ్ సక్సెస్ అయేందుకు కారణమయ్యారు.
ఈ సినిమాలోని పాటలన్నీ కూడా మంచి హిట్టు. ముఖ్యంగా జగమే మాయ బ్రతుకే మాయ, కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, పల్లెకు పోదాం అనే పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతాయి. ఈ ట్రాక్స్ ని కంపోజ్ చేసింది సీ ఆర్ సుబ్బరామన్, లిరిక్స్ రాసిన వాళ్ళు సముద్రాల రాఘవాచార్య, నారాయణ కవి, సంతానం గార్లు.
ఇక డైలాగ్ ల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
‘తాగితే మరువగలను, తాగనివ్వరు
మరిచిపోతే తాగగలను, మరువనివ్వరు’ డైలాగ్ హైలైట్.
వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించి, డీ ఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాని ఈ సంధర్భంగా మళ్ళీ ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి.
Leave a comment