కోటా శ్రీనివాస రావు. తెలుగు సినీ చరిత్రలో ఆయనకంటూ కొన్ని పేజీలున్నాయి. ఎందుకంటే, ఆయన ఎప్పటినుంచో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఒక నటుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. నటుడిగా సినీ తెరమీద కనిపించటం కన్నా ముందే ఆయనొక థియేటర్ ఆర్టిస్ట్. కళాకారుడు. ఇలా కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా mla గా ఒక పదవీకాలం వ్యవహరించిన వ్యక్తిగా కూడా ఆయన తెలుగు ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన పుట్టిన రోజు సంధర్భంగా ఈ రోజు ఆయన గురించి తెలుసుకుందాం.
మన దేశానికి స్వాతంత్ర్యం రావడానికి సరిగ్గా నెలరోజుల ముందు ఆయన విజయవాడలో పుట్టారు. 10th జూలై, 1947. 1978 లో వచ్చిన ప్రాణం ఖరీదు సినిమాతో తొలిసారి సినిమాలో నటించిన ఆయనకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. దాదాపు 750 సినిమాల్లో నటించారంటే మామూలు విషయం కాదు. ఈ మధ్య ‘మా’ ఎన్నికల సంధర్భంగా స్పందించిన ఆయన.. ”సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు. అదృష్టం కూడా ఉండాలి. అందుకే కోటా శ్రీనివాస రావ్ ఇంతటి వాడు అయ్యాడు..” అని ఆయన అన్నారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు.
కోటా శ్రీనివాస రావ్ కి ఇప్పటిదాకా ఉత్తమ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా 9 నంది అవార్డ్స్ వచ్చాయి. 2012 లో కృష్టం వందే జగద్గురుం సినిమాలో నటనకి గాను Siima అవార్డ్ వచ్చింది. 2015 లో భారత ప్రభుత్వం నుంచి ఆయన పద్మశ్రీ అవార్డ్ కూడా తీసుకున్నారు. ఐతే, కోటా గారు 2010 లో ఉన్న ఒక్కగానొక్క కొడుకుని కోల్పోయారు. ఆయన కూడా ఒక నటుడే. సిద్ధం సినిమాలో ఒక పాత్ర పోషించడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే, ఆయన తమ్ముడు శంకర్ రావ్ కూడా తెలుగు ప్రేక్షకులకి పరిచయం. నేటితో 74 ఏళ్ళు.
Leave a comment