సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్కు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకంటూ ఇండస్ట్రీలో సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అందరూ ఆయనని దేవుడిలా- హీరోలా కాకుండా ఒక అన్నలా భావిస్తారు. అలాంటి రేర్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా తక్కువ మందికే ఉంటుంది. రీసెంట్గా ఆయన నటించిన దేవరకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అయింది. నిన్న సాయంత్రం రిలీజ్ అయిన గ్లింప్స్ సోషల్ మీడియాని షేక్ చేసి పడేసింది.ఎన్టీఆర్ ని ఆది సినిమా తర్వాత మళ్లీ అంతటి మాస్ రేంజ్ లో ఈ సినిమాలోనే చూస్తున్నాం అంటూ ఫ్యాన్స్ బాగా పొగిడేస్తున్నారు.
దేవర మూవీ గ్లింప్స్ ప్రేక్షకుల అంచనాలను మించి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇలాంటి క్రమంలోనే ఫ్యాన్స్ జూనియర్ అనే ట్యాగ్ ఎన్టీఆర్ కి తీసేసి “మాన్ అఫ్ మాసస్” అనే ట్యాగ్ ఇచ్చారు. ఈ సినిమాల్లో మాస్ నెస్ తో ఇరగదీసేసాడు ఎన్టీఆర్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కొత్త ట్యాగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇన్నాళ్లు మనం తారక్ ని జూ ఎన్టీఆర్ యంగ్ టైగర్ అని పిలిచాం.. ఇక పై మాత్రం “మ్యాన్ ఆఫ్ మాసెస్ “అనే పిలవాలి అంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. దేవర గ్లింప్స్ లో అనిరుధ్ ఇంగ్లీష్ బిట్ ఉంటుందని ప్రచారం జరగగా ఆ ప్రచారం ఎట్టకేలకు నిజమైంది.
ఐదు భాషల్లో గ్లింప్స్ విడుదల కాగా ఈ గ్లింప్స్ వేరే లెవెల్ లో ఉంది. ఛత్రపతి సినిమాలో “తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని ఎరుపెక్కుతాయ్” అనే లైన్ కు దేవర్ పర్ఫెక్ట్ రిప్రజెంటేషన్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.రత్నవేలు సినిమాటోగ్రఫీ వేరే లెవెల్ లో ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ అదుర్స్ అనేలా ఉంది. అయితే దేవర గ్లింప్స్ లో వచ్చిన ఇంగ్లీష్ లిరిక్స్ తో ఈ మూవీ స్టోరీ మొత్తం చెప్పేసారనే కామెంట్లు వస్తున్నాయి.. తండ్రి- కొడుకుల మధ్య జరిగే యుద్ధమే దేవర స్టోరీ అని ప్రచారం జరుగుతుంది. “నువ్వు ఎప్పుడూ సముద్రాన్ని తాకలేదు.. నువ్వు ఎప్పుడూ నాతో ఆడుకోలేదు.. నేను ఎప్పుడూ నీపై దయ చూపించను.. నిన్ను నేను బ్రతకనివ్వను.. నీ రక్తాన్ని ఏరులై పారిస్తాను” అని ఆ ఇంగ్లీష్ సాంగ్ కు అర్థం.
అయితే ఇప్పుడు వచ్చిన గ్లింప్స్ లో తండ్రి గురించి ప్రస్తావిస్తూ లిరికల్ సాంగ్ ఉందని అర్థమవుతుంది. ఇక ఈ మూవీ ర్ టీజర్, ట్రైలర్ విడుదల అయితే కానీ ఈ సినిమా స్టోరీ గురించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్, విలన్ సైఫాలీ ఖాన్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయో తెలియాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్ దేవర సినమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అదే విధంగా ఎన్టీఆర్ యాక్షన్ అనిరుద్ క్రేజీ మ్యూజిక్ తో అదిరిపోయిన వీడియో కైతే పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ రెస్పాన్స్ అయితే వస్తుంది.
24 గంటలు కాకముందే ఏకంగా 40 మిలియన్ కి పైగా వ్యూస్ ను క్రాస్ చేసింది. దీనితో దేవర మేనియా ఏవిదంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే ఓవరాల్ గా 1 మిలియన్ లైక్స్ ని కూడా ఇది క్రాస్ చేసేసింది. దేవర సినిమా గ్లింప్స్ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు వేరే లెవెల్ లో ఉండనున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర మూవీ 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.