Varun Tej Lavanya Tripathi: సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ సినీ ప్రేక్షకులని గందరగోళానికి గురి చేస్తూ ఉంటాయి. నిత్యం వందలకొద్ది రూమర్స్ హల్ చల్ చేస్తుండగా, అందులో ఎంత నిజం ఉందనే దానిపై అయితే క్లారిటీ ఉండదు. గత కొద్ది రోజులుగా వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠిల ప్రేమ, పెళ్లికి సంబంధించి అనేక వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నట్లుగా ఎన్నో రోజుల నుండి టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్రేమ వార్తలు కేవలం రూమర్స్ అని వరుణ్ తేజ్‌తో పాటు లావణ్య త్రిపాఠి గతంలో క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ వాటికి పులిస్టాప్ పడడం లేదు. రీసెంట్గా వారి ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ చేశారు.
వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ ఈ నెల 9న జరుగనుందని, ఈ వేడుక హైదరాబాద్‌లో ఇరు కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితుల సమక్షంగా సింపుల్‌గా జరగనుందని చెబుతున్నారు. ఇక ఇప్పుడు వీరి ప్రేమకి సంబంధించి కొత్త ప్రచారాలు నడుస్తున్నాయి. వీరి మధ్య ప్రేమ పుట్టడానికి కారణం ఓ దర్శకుడు అని ఆయన వల్లనే వీరిద్దరు ప్రేములో పడ్డారని కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్‌లు 2017లో శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’ అనే చిత్రంలో కలిసి నటించిన విషయం తెలిసిందే.
మిస్టర్ చిత్రాన్ని శ్రీను వైట్ల తెరకెక్కించగా, చిత్రంలో ఇద్దరి మధ్య మంచి రొమాంటిక్ సీన్స్ పెట్టారు. వాటి వల్లనే వరుణ్ తేజ్ లావణ్యల మధ్య ప్రేమ పుట్టిందని, ఈ రకంగా వీరిద్దరి మధ్యా ప్రేమ పుట్టడానికి శ్రీను వైట్లనే కారణం అంటూ చర్చ నడుస్తుంది. సాదారణంగా సోషల్ మీడియా శ్రీను వైట్ల సినిమాల్లోని మీమ్స్ తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటిది ఇప్పుడు శ్రీను వైట్ల మీదే మీమ్స్ చేస్తూ.. నెటిజన్లు కామెడీ పంచుతున్నారు. కాగా, వరుణ్ తేజ్ 2000 సంవత్సరంలో వచ్చిన ‘హేండ్సప్’ అనే సినిమాతో బాల నటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగా, 2014లో వచ్చిన ‘ముకుంద’తో హీరోగా పరిచయం ఇంట్రడ్యూస్ అయ్యారు. ఇక లావణ్య విషయానికి వస్తే ఈ అమ్మడు తెలుగులో చాలానే చిత్రాలు చేసింది. ఇందులో కొన్ని మంచి విజయం సాధించాయి.