కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు ఫర్హాన్ అని, ఎప్పటినుంచి కీర్తి ఇతడితో లవ్ లో ఉందని అనేక రకాలుగా ముచ్చటించుకున్నారు.కాని వాటన్నింటికి చెక్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇటీవల దసరాతో ప్రేక్షకులని అలరించిన కీర్తి సురేష్ తాజాగా ఉదయానిధి స్టాలిన్ తో మామన్నన్ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీ ఆడియో లాంచ్ లోనూ కీర్తి సురేష్‌కి పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఆ సమయంలో కీర్తి సురేష్ మాట్లాడుతూ.. ‘నా పెళ్లి వార్తలపై ఇప్పటికే ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చాను. మీరంతా పెళ్లి గురించే ఎందుకు అడుగుతున్నారు, నాకు అర్ధం కావడం లేదని కీర్తి పేర్కొంది.
నా వెడ్డింగ్ గురించి అంత ఆసక్తి ఎందుకు? ఒకవేళ నా పెళ్లకి సంబంధించి ఏదైన ప్లానింగ్ జరిగితే నేనే స్వయంగా ప్రకటిస్తా. ప్రతి సారి ఇలా అడగాల్సిన అవసరం లేదు అంటూ కీర్తి పేర్కొంది. కీర్తి నటిస్తున్న ‘మామన్నన్’ చిత్రం ఈనెల 29న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంటూ ఆసక్తికర విషయాలు తెలియజేస్తుంది. మరోవైపు ఈ అమ్మడు తెలుగులో ‘భోళా శంకర్’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆగస్టు 11న థియేటర్లలోకి రానుంది. ఇందులో కీర్తి చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపించి సందడి చేయనుంది.