Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ప్రభంజనం. ఎంత మంది హీరోలు వచ్చిన ఎవరు ఎన్ని హిట్స్ కొట్టిన కూడా చిరంజీవి క్రేజే వేరు. స్వయంకృషితో ఈ స్థాయికి చేరుకున్న చిరంజీవి ఇప్పటికీ కుర్ర హీరోలకి పోటీగా సినిమాలు చేస్తూ తన అభిమానులని అలరిస్తూనే ఉన్నాడు. అలానే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. అయితే రీసెంట్గా చిరు నానక్ రాంగూడాలోని స్టార్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ విభాగాన్ని ప్రారంభించి అనంతరం ఆయన క్యాన్సర్ గురించి కొన్ని కీలక విషయాలు వెల్లడించారు.
తాను ఇటీవల ఏఐజీ ఆస్పత్రిలో కొలనోస్కోపీ టెస్ట్ చేయించుకోవడం వల్ల ఆ రిపోర్ట్ లో తనకు శరీరంలో పాలిప్స్ ఉన్నట్టుగా డాక్టర్లు చెప్పారు. ఆ పాలిప్స్ ను అలాగే వదిలేస్తే మెలాగ్లిన్ గా మారే అవకాశం ఉందని డాక్టర్లు అన్నారని చిరంజీవి పేర్కొన్నారు. ముందుగా గుర్తించడం వలన తాను పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డట్టు చిరు స్పష్టం చేశారు. అయితే కొద్ది సేపటి తర్వాత చిరు కాన్సర్ బారిన పడ్డారంటూ మీడియాలో జోరుగా కథనాలు ప్రసారం అయ్యాయి. దీంతో అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు ఆందోళన చెందారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ఈ క్రమంలో చిరు తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. తాను ఎలాంటి క్యాన్సర్ బారిన పడలేదని , చెప్పిన విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా కొన్ని మీడియా సంస్థలు ఇష్టం వచ్చినట్లు రాయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన తెలియజేశారు.
నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకోవడం వలన అందులో నాన్ క్యాన్సరస్ పొలిప్స్ ని డిటెక్ట్ చేసి తీసేసారు అని అన్నాను. ఒకవేళ ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో అని చెప్పాను తప్ప క్యాన్సర్ వచ్చిందని అనలేదు. దీన్ని కొన్ని మీడియా సంస్థలు గ్రహించకుండా, అవగాహనా రాహిత్యంతో ‘నేను క్యాన్సర్ బారిన పడ్డాను’ అని, ‘చికిత్స వల్ల బతికాను’ అని స్క్రోలింగ్ లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టారు. వాటి వలన చాలా మంది కంగారు పడుతున్నారు. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు పేల్చకండి. ఇలా చేయడం వలన మీరు అనేక మందిని భయభ్రాంతులికి గురి చేసి బాధ పెట్టిన వారవుతారు అంటూ మెగాస్టార్ వివరణ ఇచ్చారు.