Karate Kalyani: ఒకప్పుడు టాలీవుడ్లో భిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందిన కరాటే కళ్యాణి ఇప్పుడు వివాదాలతో వార్తలలో నిలుస్తూ వస్తుంది. ఇటీవల దివంత అగ్ర నటుడు ఎన్టీఆర్‌ను కించపరిచేలా కామెంట్స్ చేసిన కారణంగా ఆమెని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సస్పెండ్ చేశారు. అంతేకాదు ఆమె మెంబర్‌షిప్‌ను కూడా రద్దు చేశారు. ఈ క్రమంలో కరాటే కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్టీఆర్‌పై గతంలో చాలా మంది అనేక అభ్యంతర కామెంట్స్ చేసిన కూడా వారందరిని వదిలిపెట్టి తనను మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తమ ఫ్యామిలీ మొత్తం ఎన్టీఆర్ అభిమానులమేనని చెప్పుకొచ్చింది.
రీసెంట్గా కరాటే కళ్యాణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొందరు తనపై దాడులకు ప్రయత్నించారని, చంపడానికి కూడా యత్నించారని తెలిపింది. ఇటీవల కొందరు దుండగులు తన కారు రెండు టైర్లను కోసేశారని వెల్లడించింది. ఇటీవల హిందుత్వ వాదులతో కలసి ఏదో గుడి దగ్గర గొడవ జరుగుతుంది అంటే తన కార్ లో వెళ్లామని, అటునుంచి తిరిగి ఓ డొంక రోడ్ లో వస్తున్నపుడు తన కార్ టైర్ పేలిపోయిందని కళ్యాణఙ చెప్పుకొచ్చింది. వాస్తవానికి అదే టైరు ఏ హైవే మీద వెళ్తున్నపుడో కనుక పేలి ఉంటే ఎంతపెద్ద ప్రమాదం జరిగి ఉండేది. కార్ టైరు చూసిన మెకానిక్ లు ముందే ఎవరో కార్ టైరును కొంచెం కోసేశారని అన్నారని, తన మీద కోపం తోనే ఎవరో ఇలా చేశారంటూ వాపోయింది కరాటే కళ్యాణి.
ఇక ఎన్టీఆర్ వివాదం గురించి మాట్లాడుతూ.. కృష్ణుడికి ఒక రూపం ఉందని ఆయన రూపంలో మనుషుల విగ్రహాలు పెట్టడం ఏ మాత్రం సరికాదని పేర్కొంది. ఈ విషయంలో శ్రీకృష్ణుడే తనకు అండగా ఉంటారని, అందుకే కోర్టు రెండు సార్లు స్టే విధించిందని కూడా తెలియజేసింది. ఎన్టీఆర్‌కి మా ఫ్యామిలీ పెద్ద అభిమానులు. ఆ స్థానంలో ఎవరు ఉన్నా కూడా పోరాడేదానినని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చింది. మా అసోసియేషన్ నుంచి తనను తీసేయడం వలన పెద్దగా నష్టం ఏమీ లేదని తెలిపింది. హిందుత్వ వాదిగా, యాదవ సంఘం నాయకురాలిగా తనకు మంచి ఉందని స్పష్టం చేసింది.