వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు కలిసి మిస్టర్, అంతరిక్షం అనే చిత్రాలలో కలిసి నటించారు. అయితే వీరిద్దరి ప్రేమకి బీజం పడింది మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో. మిస్టర్ షూటింగ్ కోసం వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఇటలీ వెళ్ళినప్పుడు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డట్లు సమాచారం. కెరీర్ లో బాగా స్థిరపడే వరకు తమ ప్రేమ వ్యవహారాన్ని బయటకు రానివ్వని ఈ జంట రీసెంట్గా తన ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చారు. ఇక నిశ్చితార్థం పూర్తి కావడంతో పెళ్లి ఎక్కడ చేసుకుంటారనే చర్చ నడుస్తుంది. మెగా ఫ్యామిలీ వరుణ్, లావణ్య వివాహాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ గా చేయాలని అనుకుంటుందట.
వరుణ్ తేజ్.. తమ ప్రేమ చిగురించిన ఇటలీలోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడట. ఇటలీలో ఇప్పటికే చాలా మంది పెళ్లిళ్లు చేసుకొని ఒక్కటయ్యారు. ఇప్పుడు వరుణ్ తేజ్-లావణ్యలు కూడా ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోవాలని అనుకుంటున్నారట. వరుణ్ తేజ్, లావణ్య లకి ఇటలీ లవ్ సెంటిమెంట్ గా ఉండగా, పెళ్లి కూడా అక్కడే చేసుకోవడం గొప్ప విషయమే అని చాలా మంది అంటున్నారు. త్వరలోనే వరుణ్ లావణ్య వివాహానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. లావణ్య త్రిపాఠి కెరీర్ ప్రస్తుతం ఏమంత ఆశాజనకంగా లేదు. దీంతో ఆమె పెళ్లి తర్వాత సినిమాలకి గుడ్ బై చెప్పబోతున్నట్టు సమాచారం.