RGV: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు దేశం గర్వించదగ్గ సినిమాలు తీసిన ఆయన ఇప్పుడు మాత్రం అన్ని చెత్త సినిమాలు తీస్తూ విమర్శల పాలవుతున్నాడు. ఇక సోషల్ మీడియాలో వర్మ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు. అయితే వర్మ సినిమాల విషయానికి వస్తే ఆయన తీసే సినిమాలు ఎప్పుడు విడుదలయ్యాయి, ఎప్పుడు థియేటర్ నుండి వెళ్లిపోయాయి కూడా ఎవరికి తెలియడం లేదు. ఇటీవలికాలంలో ఏపీ రాజకీయాల్లో కాంట్రవర్షియల్ అంశాలని మొయిన్ పాయింట్‌గా తీసుకొని కాంట్రవర్సీస్లతో సంచలనాలు సృష్టిస్తున్నాడు.
వర్మతెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, పవర్ స్టార్ ఇలా పలు వివాదాస్పద చిత్రాలు కొందరిని టార్గెట్ చేస్తూ తెరకెక్కించడం మనం చూశాం. ఇక ఇప్పుడు ఏపీ రాజకీయాలపై వ్యూహం అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి మానేసిన గార్లపాటి వెంకటేష్ అనే వ్యక్తి కొన్ని సంచలన ఆరోపణలు చేశాడు. వర్మ చాలా చెత్త పనులు చేసి దాదాపు రూ.20 కోట్ల వరకు అప్పుల పాలయ్యారు. ఇప్పుడు ఆ అప్పు తీర్చే అంత డబ్బు ఆయన దగ్గర లేదు. అందుకే వైసీపీ నాయకులతో జట్టు కట్టాడు.
కొందరు వైసిపి నాయకులు వర్మని వాడుకుని తమకు నచ్చినట్టుగా సినిమాలు తీయించుకుంటున్నారు. వాళ్ళిచ్చే పేమెంట్ కి బాగా అలవాటు పడ్డ వర్మ వారు చెప్పిన వారిపై విషం కక్కుతున్నాడు. అప్పట్లో వైసిపి నాయకులు కొందరు నేరుగా వచ్చి వర్మతో డీల్స్ మాట్లాడడం నేను కళ్లారా చూశాను అని వెంకటేష్ స్పష్టం చేశారు.. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా టైంలో ఏర్పడ్డ విబేధాల వలన నేను తప్పుకుని పక్కకు వచ్చేశాను. డబ్బుల కోసమే వర్మ తన సినిమాలలో కొందరిపై విషం చిమ్ముతున్నాడు. వ్యూహం సినిమాలో కూడా చంద్రబాబు, పవన్, లోకేష్ పాత్రలు ఉండబోతున్నాయి అని అన్నాడు వెంకటేష్. ఆయనకు ఏదైనా చెప్పాలన్నా జంట్స్ తో డిస్కస్ చేయడు.. కేవలం ఫీమేల్ అసిస్టెంట్స్ తో మాత్రమే మాట్లాడతాడు అని వెంకటేష్ గార్లపాటి .. వర్మపై సంచలన ఆరోపణలు చేశాడు.