Adipurush: బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌కి తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశ వ్యాప్తంగా అమితమైన క్రేజ్ దక్కింది. ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం ఆదిపురుష్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు గ్రాండ్‌గా రానుంది. ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ చిత్రం 6200 స్క్రీన్లలో విడుదల కానుంది. ఈ మేరకు మంగళవారం రాత్రి నుంచి టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ సినిమా టికెట్లు బుక్ మై షోలు అందుబాటులో ఉండగా, బుకింగ్స్ ప్రారంభమైన గంటల్లోనే బుక్ మై షో సైట్ క్రాష్ అయింది. ఫ్యాన్స్ భారీ ఎత్తున టికెట్ల బుకింగ్ కోసం ప్రయత్నంచడంతో సైట్ క్రాష్ అయిందని అంటున్నారు.
చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూద్దామా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఈ సినిమా హెచ్ డీ ప్రింట్ ఆన్లైన్లో లీక్ అయిందనే వార్త నెట్టింట వైరల్ అవుతుంది. చిత్ర విడుదలకు ముందే ఆన్లైన్ లో కొంతభాగం లీక్ అయిందని అంటున్నారు. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలు యూట్యూబ్ లో లీక్ అయ్యాయట. సినిమా ఎడిటింగ్ సమయం లో కట్ చేసిన కొన్ని షాట్స్ ని మూవీ టీం కి సంబంధించిన వాళ్ళే లీక్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఓవర్సీస్ ప్రివ్యూ షో ప్రదర్శించగా ఇది తెగ నచ్చేసిందట.
ఆదిపురుష్ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రం మొదటి రోజే భారీగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీ హక్కులని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండిపెండెన్స్ సందర్భంగా అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదల చేసే అవకాశం ఉంది. అన్ని భాషల్లో కలిపి ఆదిపురుష్ చిత్రం ఓటీటీ హక్కులను 250 కోట్లకు అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఆదిపురుష్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.100 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది