Allu Arjun: స్టార్ హీరోలు సైతం ఇటీవల థియేటర్ బిజినెస్‌లలోకి ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వంటి వారు థియేటర్ బిజినెస్ మొదలు పెట్టగా, వారి జాబితాలోకి బన్నీ చేరాడు. ఈ రోజు అల్లు అర్జున్ మల్లీ ప్లెక్స్ గ్రాండ్‌గా లాంచ్ కాగా, ఈ కార్యక్రమానికి బన్నీతో పాటు అల్లు అరవింద్ ,మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. లాంచింగ్‌కి బన్నీ వస్తున్నాడని తెలుసుకొని అక్కడికి భారీగా అభిమానులు వచ్చారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఇక ఈ థియేటర్ విషయానికి వస్తే.. ఇది ప్రేక్షకులను అబ్బుర పరిచే విధంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంది
ఏఏఏ సినిమాస్‌లో మొత్తం 5 స్క్రీన్స్ ఉంటాయి. అందులో ఒకటి అల్ట్రా హెచ్ డి సిస్టం కలిగిన ఎల్ ఈడీ స్క్రీన్ కాగా, మిగతావి నార్మల్ ప్రొజెక్టర్ స్క్రీన్స్. లోపల సీటింగ్, ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. భారీ ఫుడ్ కోర్టు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక ఇందులోని స్క్రీన్స్ లో మొదటి స్క్రీన్ చాలా పెద్దదిగా ఉంటుంది. ఇందులో తాజాగా ఆదిపురుష్, హరిహర వీరమల్లు, ఆర్ఆర్ఆర్, భగవంత్ కేసరి లాంటి చిత్రాల టీజర్స్, ట్రైలర్స్ ప్రదర్శించారు. ఇక ఈ థియేటర్ని వీక్షించేందుకు అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుప్రియ, ఇతర సెలెబ్రిటీలు అక్కడికి వచ్చారు. రేపు విడుదలయ్యే ఆదిపురుష్ చిత్రం ఏఏఏ సినిమాస్ లో ప్రదర్శించబోయే తొలి చిత్రం కానుంది. ఇందులో టికెట్ ధర రూ.295గా నిర్ణయించినట్టు తెలుస్తుంది.
ఈ థియేటర్లో అల్లు అర్జున్, ఏషియన్ సునీల్ నారంగ్, భరత్ నారంగ్, మురళి మోహన్, సదానంద్ గౌడ్ భాగస్వాములుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మూడు లక్షల చదరపు అడుగుల్లో రూపొందిన ఈ మాల్ లో 3 ఫ్లోర్స్ పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఏఏఏ ఫుడ్ కోర్ట్ మూడో ఫ్లోర్ లోనూ, ఏఏఏ సినిమాస్ నాలుగో అంతస్తులో ఉన్నాయి.. మొదటి స్క్రీన్ 67 అడుగులు ఎత్తుగా ఉండనుండగా, ఇందులో లో బార్కో లేజర్ ప్రొజెక్షన్, అట్మాస్ సౌండ్ వంటి వరల్డ్ క్లాస్ ఫీచర్లు ఉండనున్నాయి. స్క్రీన్ 2లో ఎపిక్ లక్సాన్ ని పొందుపరిచారు. ఇది కూడా అట్మాస్ సౌండ్ తోనే వస్తుంది.. మిగతా స్క్రీన్లన్నీ 4కే ప్రొజెక్షన్ తో రానున్నాయి. డాల్బీ 7.1 సౌండ్ సిస్టం కూడా అందుబాటులో ఉంటుంది.