Pawan Kalyan Heroine: టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇందులో కొందరికి అదృష్టం కలిసి వచ్చి ఎక్కువ కాలం కొనసాగితే మరి కొందరు మాత్రం మధ్యలోనే పరిశ్రమ నుండి పక్కకు జరగాల్సి వచ్చింది. అయితే బాలీవుడ్ నుండి వచ్చి టాలీవుడ్లో మంచి విజయాలు చవి చూసిన భామ అమీషా పటేల్. ఈ అమ్మడు 2000 ‘కహో నా ప్యార్ హై’ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన అమీషా పటేల్ తెలుగు లో కూడా నటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాలో తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా అమీషా పటేల్.. ఓ కేసులో ఇరుక్కోవడమే కాకుండా.. కోర్టులో కూడా సరెండర్ అయ్యింది కూడా. జూన్ 17 ఉదయం రాంచి సివిల్ కోర్టులో ఆమె లొంగిపోవల్సి వచ్చింది. సినిమా నిర్మాత, వ్యాపారవేత్త అయిన అజయ్ కుమార్.. అమీషా పటేల్‌పై చెక్ బౌన్స్ కేసు వేయడంతో ఆమె కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతను తన పిటీషన్లో అమీషా పటేల్.. సినిమా నిర్మిస్తానంటూ తన దగ్గర 2.5 కోట్లు అప్పుగా తీసుకున్నదని, ఇంత వరకు ఆ సినిమా చేయలేదు అలానే డబ్బు తిరిగి ఇవ్వలేదు అని తెలియజేశాడు. ఇప్పుడు తనకు వడ్డీ 50 లక్షలు కలిపి మొత్తం .3 కోట్లు ఇప్పించాలని ఆయన కోర్టును ఆశ్రయించాడు.
అయితే ఈ కేసు విచారణ చేపట్టిన కోర్టు ఏప్రిల్ నెల 6న అమీషా పటేల్‌కు వారెంట్ ఇష్యూ చేయగా, ఇప్పుడు హాజరైంది. అయితే పలు షరతులతో ఆమెకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు నుంచి అమీషా పటేల్ బయటకు వచ్చే సమయంలో మీడియా వాళ్లు ఫొటోలు తీసేందుకు ప్రయత్నం చేయడంతో ఆమె తలకు ముసుగు కప్పుకొని ఎవరినీ పట్టించుకోకుండా సీరియస్‌గా కారు ఎక్కి అక్కడ నుంచి వెళ్లిపోయింది. ముసుగులో అమీషా పటేల్ కోర్టు నుంచి బయటకు రావడానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. మీడియా ప్రతినిథులు ఎన్ని ప్రశ్నలు వేసిన కూడా అవేమి పట్టించుకోకుండా ఆమె స్పీడ్‌గా వెళ్లిపోవడం గమనర్హం.