Allari Naresh: ఓటమెరుగని విక్రమార్కుడిగా , దేశం గర్వించదగ్గ దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్నారు రాజమౌళి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన రాజమౌళి.. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ కలని కూడా సాకారం చేసుకున్నాడు. స్టూడెంట్ నంబర్ వన్ సినిమాతో తన కెరీర్ మొదలుపెట్టిన రాజమౌళి సింహాద్రి, సై, ఛత్రపతి, మగధీర, ఈగ, బాహుబలి, మొన్న ఆర్ఆర్ఆర్ ఇలా వరుస విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు. రాజమౌళితో సినిమా చేయాలని ప్రతి ఒక్కరి కల. ఇప్పుడు స్టార్ హీరోలు సైతం రాజమౌళితో సినిమా చేయాలని అనుకుంటున్నారు. త్వరలో మహేష్ బాబుతో హాలీవుడ్ రేంజ్లో సినిమా చేయనున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు కాగా, ఏడాది చివరలో లేదంటే వచ్చే సమ్మర్లో మూవీ చిత్రీకరణ జరపనున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక రాజమౌళి ఏ హీరోతో సినిమా చేయనున్నాడనే చర్చ నడుస్తుంది. ఇక ఇదిలా ఉంటే రాజమౌళితో సినిమా అవకాశం వస్తే దాదాపు ఏ హీరో కూడా వదులు కోరు. అలాంటి అల్లరి నరేష్ ఆయనతో పని చేసే గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకున్నట్టు తెలుస్తుంది. రాజమౌళి భారీ బడ్జెట్ చిత్రాలే కాక మీడియం చిత్రాలు కూడా చేశారు. సునీల్ హీరోగా, సలోని హీరోయిన్ గా మర్యాద రామన్న అనే కామెడీ డ్రామా తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద విజయాన్ని అందుకుంది.
మర్యాద రామన్న అప్పట్లో ఈ మూవీ 34 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో హీరో కోసం దర్శకుడు రాజమౌళి ముందుగా అల్లరి నరేష్‌ని సంప్రదించారట .కథ చెప్పగానే అల్లరి నరేష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట.అయితే ఈ సినిమా పూర్తయ్యే వరకు మరో ప్రాజెక్ట్ చేయకూడదని రాజమౌళి కండీషన్ పెట్టడంతో అల్లరోడు వెనక్కి తగ్గాడట. ఏడాదికి ఆరుకి పైగా సినిమాలు చేసే నరేష్ ఒక్క సినిమా కూడా చేయకుండా ఉండడం అంటే కష్టమని భావించి వెనక్కి తగ్గాడట. నరేష్ రిజెక్ట్ చేసిన ఆఫర్ సునీల్ దగ్గరకు వెళ్లడం, అందులో సునీల్ అద్భుతమైన నటనకి మంచి పేరు కూడా రావడం జరిగింది.