Upasana: ఎంతో మంది మెగా అభిమానుల ఎదురు చూపులకి పులిస్టాప్ పడింది. ఉపాసన జూన్ 20న ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్త విని మెగా కుటుంబ సభ్యులే కాదు.. వారి అభిమానులు కూడా చాలా సంతోషపడ్డారు. అయితే ఎప్పుడు ఆ స్పెషల్ డే వస్తుందోననేది ముందు ఎవరు చెప్పలేదు. ఆ మధ్య ఓ సందర్భంలో చిరంజీవి మాట్లాడుతూ జూలైలో చరణ్, ఉపాసనలకు బిడ్డ పుట్టే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అయితే జూన్ 19 సాయంత్రం రామ్ చరణ్, ఉపాసన, సురేఖ అపోలో ఆసుపత్రిలో ప్రత్యక్షం కావడంతో ఇక డెలివరీ టైం దగ్గర పడ్డట్టే అని అందా అనుకున్నారు. ఎట్టకేలకు జూన్ 20 ఉదయం తెల్లవారుఝామున ఉపాసన పండంటి పాపాయికి జన్మనిచ్చింది.
జూన్ 20వ తేదీన అపోలో హాస్పిటల్ వైద్యులు పర్యవేక్షణ ఉపాసనకి డెలివరీ జరిగింది. గత రాత్రి నుండి రాంచరణ్‌తోపాటు ఉపాసన కుటుంబ సభ్యులంతా అపోలో హాస్పిటల్‌లోనే ఉన్నారు. రామ్ చరణ్-ఉపాసన దంపతులకి పెళ్లి అయి పదేళ్లు అయినా పిల్లలు పుట్టలేదని మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు చాలా బాధపడ్డారు. ఎట్టకేలకి మెగా వారసురాలు రావడంతో ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఇన్నాళ్లు తాము పిల్లలని కనకపోవడానికి గల కారణం చెప్పింది ఉపాసన. రామ్ చరణ్ తో పెళ్లి తర్వాత మేమిద్దరం జీవితంలో స్థిరపడ్డాక పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నామని ఆమె స్పష్టం చేసింది.
ఇప్పటికే చిరంజీవి కూతురు శ్రీజకి ఇద్దరు అమ్మాయిలు ఉండగా, ఇప్పుడు వారింట మరో మహాలక్ష్మీ అడుగుపెట్టింది.ఇక ఇదిలా ఉంటే ప్రజ్వల ఫౌండేషన్ సంస్థ ఇటీవల ఉపాసన కోసం ఓ ఊయలను తయారు చేసి పంపారు. దాన్ని చూసి ఉపాసన చాలా మురిసిపోయింది. ఇక రామ్ చరణ్-ఉపాసనల బిడ్డ కోసం కీరవాణి తనయుడు కాలభైరవ ప్రత్యేక బాణీ రూపొందించడం విశేషం. ఈ స్పెషల్ ట్యూన్ ను రామ్ చరణ్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నారులకు ఈ ట్యూన్ సంతోషం కలిగిస్తుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్.. దర్శకుడు శంకర్‌తో కలిసి గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ తర్వాత ఆయన షూటింగ్‌లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది.