Ram Charan’s Daughter: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రేమించి ఉపాసనని వివాహం చేసుకున్నాడు. వీరిరివురు ఇటీవల 11వ పెళ్లి రోజు వేడుక జరుపుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారే కాకుండా చాలా మంది ప్రముఖులు రామ్ చరణ్, ఉపాసన దంపతులకి శుభాకాంక్షలు తెలియజేశారు. గత కొద్ది రోజులుగా ఉపాసన- రామ్ చరణ్‌ల కూతురు గురించి నెట్టింట తెగ ప్రచారాలు జరుగుతున్నాయి. ఆమె జాతకం, ఏ పేరు పెట్టబోతున్నారు, ఎవరికి ఇచ్చి పెళ్లి చేయబోతున్నారు ఇలా ఒకటేంటి అనేక రకాలుగా ఆ చిన్నారి గురించి జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇక చిరంజీవి సైతం.. ఈ చిన్నారి గొప్ప ఘడియల్లో పుట్టిందని అన్నారు. మంగళవారం రోజు మా ఇష్ట దైవం హనుమాన్ అశీసులతో అమ్మాయి పుట్టిందని చిరు సంతోషం వ్యక్తపరిచారు.
మంచి ఘడియలలో పుట్టిన రామ్ చరణ్ కూతురు తన తండ్రి కన్నా, తాత చిరంజీవి కన్నా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తుందని పలువురు చెబుతున్నారు. ఆమె పుట్టిన జాతకం అలాంటిదని, పాప మాత్రం మంచి పేరు సంపాదించడం ఖాయం అని పలువురి మాట. అయితే ఇప్పుడు ఈ పాప ఆస్తుల విలువ కూడా హాట్ టాపిక్‌గా మారింది. వివరాలలోకి వెళితే.. రామ్ చరణ్-ఉపాసన దంపతుల ఆస్తి విలువ విషయానికి వస్తే వారి ఆస్తుల విలువ రూ. 2500 కోట్లు అని తెలుస్తుండగా, ఇందులో అధిక భాగం ఉపాసన ఆస్తి ఉంటుందట. ఉపాసనకి వెయ్యి కోట్లకు పైమాటే ఆస్తి ఉందని అంటున్నారు.
ఉపాసన అపోలో చైర్మన్ సి. ప్రతాప్ రెడ్డి మనవరాలు కాగా, ఆమె తాత ఆస్తి విలువ రూ. 21000 కోట్లుకి ఉంటుంది. ఇక అపోలో గ్రూప్ మార్కెట్ వాల్యూ రూ. 70000 కోట్లు ఉంటుంది. చిరంజీవి ఆస్తులు, తాను సంపాదించింది కూడా చేస్తే రామ్ చరణ్‌కి కూడా బాగానే ఆస్తులు ఉన్నాయట. అయితే పుట్టిన చిన్నారి రానున్న రోజులలో తన తల్లిదండ్రులని మించిపోతుందని టాక్. ఆమె గొప్ప ఘడియల్లో పుట్టింది కాబట్టి.. ఆమె జాతకం, భవిష్యత్ కూడా అమోఘగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఇక 2012 ఉపాసన-రామ్ చరణ్ వివాహం చేసుకున్నారు. వీరిరువురు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోవడంతో నే వీరి వివాహం జరిగింది. మొదటి నుండి వీరు చాలా అన్యోన్యంగా నివసిస్తూ ఉన్నారు.