Meera Jasmine: ఒకప్పుడు హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి.. ఫ్లాపుల వల్ల ఫేడవుట్ అవడం వల్లో, కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకోవడం వల్లో కనుమరుగైపోయిన భామలు చాలా మంది సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. నదియా, మీనా, సిమ్రాన్, దేవయాని, ఖుష్బూ, రాధిక, భూమిక, స్నేహా, మమతా మోహన్ దాస్.. ఇలా పెద్ద లిస్టే ఉంది.
వీళ్లల్లో చాలా మందికి ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తుంటే.. మరికొంత మంది మాత్రం మేం మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోవడానికి రెడీ అంటూ మేకర్స్‌కి హింట్స్ ఇస్తున్నారు. అందుకోసం వెరైటీ ఫొటోషూట్లతో వలపు వయ్యారాలు ఒలకబోస్తున్నారు. ఈ కేటగిరీలో మలయాళీ భామ మీరా జాస్మిన్ ముందు వరుసలో ఉందని చెప్పొచ్చు.
2001లో మాతృ భాష మలయాళంలో కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేసిన మీరా.. తమిళ్లోనూ యాక్ట్ చేసింది. ‘అమ్మాయి బాగుంది’ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయిన మీరా.. తర్వాత ‘గుడుంబా శంకర్’, ‘భద్ర’, ‘మహారథి’ లాంటి సినిమాలు చేసింది. ‘గోరింటాకు’ లో రాజశేఖర్ చెల్లెలిగా కనిపించింది. కన్నడతో పాటు తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసింది కానీ హిట్స్‌తో పాటు అవకాశాలూ తక్కువయ్యాయి. మాండలిన్ రాజేష్‌తో పెళ్లి అని ప్రకటించి, తర్వాత దుబాయ్‌లో ఇంజనీర్‌గా పని చేస్తున్న జాన్ అనే వ్యక్తిని పెళ్లాడి, సినిమాలకు దూరమైంది.
ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నానంటూ.. అంతకుముందు సినిమాల్లో కాస్త పద్ధతిగా కనిపించిన మీర జాస్మిన్.. అదిరిపోయే ఎక్స్‌పోజింగ్‌తో, హాట్ హాట్ పోజులతో అందరికీ షాక్ ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఫొటోషూట్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో హీటెక్కిస్తోంది. మరి మీరా జాస్మిన్ పడుతున్న ఆరాటాన్ని చూసి దర్శక నిర్మాతలు ఎలాంటి క్యారెక్టర్స్ ఇస్తారో చూడాలి..
https://www.instagram.com/p/CegEZWNv2ip/
https://www.instagram.com/p/CaofxgkPpg4/
Leave a comment