Varalakshmi: తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్.. తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. ఒకప్పుడు ఆమె హీరోయిన్గా పలు సినిమాలు చేసింది. తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులని అలరిస్తుంది. తెలుగులో వరలక్ష్మీ క్రాక్, నాంది, వీరసింహారెడ్డి చిత్రాల్లో లేడీ విలన్ పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఈ సినిమా తర్వాత వరలక్ష్మీ.. లేడీ విలన్ పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఇటీవల.. ఏజెంట్, మైఖేల్ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి అదరగొట్టింది. వరలక్ష్మీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అందరి మాదిరిగానే తాను కూడా కెరీర్ బిగినింగ్ లో ఇబ్బందులు, విమర్శలు ఎదుర్కొన్నట్టు చెప్పుకొచ్చింది వరలక్ష్మీ. తన గొంతు కాస్త గంభీరంగా ఉండటంతో చాలా మంది వెక్కిరించారట. మీది మగాడి గొంతులా ఉంది, హీరోయిన్‌కి ఇలాంటి గొంతు కాదు ఉండేది అంటూ కామెంట్ చేశారట. అలా చాలా సార్లు హేళన చేసేవారని, కొన్ని సినిమాలకు తనను డబ్బింగ్ కూడా చెప్పనివ్వలేదని వరలక్ష్మీ చెబుతూ బాధపడింది. అయితే ఇప్పుడు మాత్రం పట్టుబట్టి నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నా..ఇప్పుడు నా నటననే కాదు గొంతును కూడా అభిమానించే వాళ్లు పెరిగారు అని చెప్పుకొచ్చింది వరలక్ష్మీ.
కొద్ది రోజుల క్రితం ఓ టీవీ షోలో పెళ్లిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లికంటే ముందు ఒకరినొకరు తామేంటో తెలుసుకోవాలని, ఆ తర్వాతే ఎదుటి వ్యక్తి మనల్ని ఎలా చూసుకుంటాడు, మనం అతడిని ఎలా చూసుకుంటాం అనేది అర్ధమవుతుందని వరలక్ష్మీ పేర్కొంది. నేను హీరోయిన్ కావడం మా నాన్నకు ఇష్టం లేదు. నేను ఏం సాధించిన క్రెడిట్ అంతా నాదే. ఒకప్పుడు శరత్ కుమార్ కూతురుగా నన్ను పిలిచేవారు, ఇప్పుడు మాత్రం వరలక్ష్మీ తండ్రి శరత్ కుమార్ అంటున్నారు అని వరలక్ష్మీ చాలా గర్వంగా చెప్పుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది.