Nagarjuna Car: టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇండస్ట్రీలలోని మోస్ట్ రిచెన్స్ పర్సన్స్ లో ఒకరు అనే విషయం విదితమే. ఆయన సినిమాలతో పాటు బిజినెస్‌లతో ఆస్తులు బాగానే సంపాదించాడు. ఒకప్పుడు నాగ్ సినిమాలు అంటే ప్రేక్షకులకి పసందైన వినోదాన్ని పంచేవి. కాని ఈ మధ్య అంతగా అలరించలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. అయితే నాగార్జున గ్యారేజ్‌లోకి ఇప్పుడు ఒక కొత్త లగ్జరీ కారు వచ్చి చేరింది. దీని ధర వింటే బిత్తరపోవల్సిందే. నాగార్జున కియా ఈవీ 6 కొనుగోలు చేనిసనట్టు తెలుస్తుండగా, ఇది ఎలక్ట్రిక్ కార్ అని అంటున్నారు. అద్భుతమైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయని టాక్.
దాదాపు 60 నుండి 70 లక్షల వరకు ఉండే ఈ కారులో వైర్లెస్ ఛార్జర్, ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ బటన్. డ్రైవర్ సీటు పది రకాలు అడ్జస్ట్ చేసుకునే విధంగా ఉంటాయట. ఈ కారు బ్యాటరీని కేవలం నాలుగు నిమిషాలు ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు ప్రయాణం చేసే అవకాశం ఉంది . ఇక ఫుల్ కెపాసిటీ 77.4 కిలో వాట్స్ ఛార్జ్ చేస్తే 528 కిలోమీటర్స్ ప్రయాణం చేయవచ్చు అంటున్నారు. ప్రస్తుతం ఈ కారుతో కలిసి నాగార్జున, అమల కలిసి దిగిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఓ ఖరీదైన కారుని కొనుగోలు చేసినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
కింగ్ నాగ్ విషయానికి వస్తే ఆయన మాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. నాగ్ అటు యాక్షన్ మూవీస్‌తో పాటు కామెడీ, డివోషనల్ జోనర్లోనూ పలు సినిమాలు చేయడం వల్లే మిగతా హీరోల కంటే కాస్త భిన్నమైన ఇమేజ్ను అయితే అందుకున్నారు. 2016లో నాగ్ నటించిన సోగ్గాడే చిన్నినాయనా మాత్రమే కాస్త మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన మన్మథుడు 2, వైల్డ్ డాగ్, ఘోస్ట్ పరాజయం పొందాయి. కొడుకు నాగ చైతన్యతో కలిసి చేసిన బంగార్రాజు యావరేజ్ టాక్ అందుకుంది. ఇక ఈ రోజు నాగ్ 62వ మూవీ ప్రకటన రాగా, ఈ సినిమాతో అయిన మనోడు మంచి హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.