Vikram – Top Gun MaveRick: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ చాలా గ్యాప్ తర్వాత సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టారు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్.. కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ వంటి బిగ్ స్టార్స్‌తో చేసిన స్టైలిష్ యాక్షన్ ఫిలిం ‘విక్రమ్’ తమిళ్, తెలుగుతో పాటు వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.
కలెక్షన్స్ ఇప్పటికే 300 కోట్ల మార్క్ టచ్ చేసింది. కమల్ పెండింగ్ ఉన్న అప్పులు తీర్చేసానని చాలా ఎమోషనల్‌గా చెప్పారు. రోలెక్స్ అనే గెస్ట్ రోల్ చేసిన సూర్యకి రోలెక్స్ వాచ్, డైరెక్టర్‌కి లగ్జరీ కార్, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి టూవీలర్స్ గిఫ్ట్ ఇచ్చారు కమల్. తమిళనాట రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేస్తుంది ‘విక్రమ్’..
ఇదిలా ఉంటే.. హాలీవుడ్ మూవీ ‘టాప్ గన్ మావెరిక్’ కి, కమల్ హాసన్ ‘విక్రమ్’ కి మధ్య అనుకోకుండా ఓ పోలిక కుదిరింది. అదేంటంటే.. 1986లో కమల్ హీరోగా తమిళ్లో ‘విక్రమ్’ అనే సినిమా వచ్చింది. దీన్ని తెలుగులో ‘ఏజెంట్ విక్రమ్’ అనే పేరుతో వదిలారు. అదే ఏడాది నాగార్జున ‘విక్రమ్’ అనే మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు.
1986లో కమల్ ‘విక్రమ్’, టామ్ క్రూజ్ ‘టాప్ గన్’ (పార్ట్ వన్) విడుదలయ్యాయి. మళ్లీ 36 సంవత్సరాల తర్వాత 2022లో కమల్ ‘విక్రమ్’ టైటిల్‌తో చేసిన సినిమా.. టామ్ క్రూజ్ ‘టాప్ గన్’ సీక్వెల్ ‘టాప్ గన్ మావెరిక్’ కూడా విడుదలవడం విశేషం. అలాగే ‘విక్రమ్’ 2022లో తమిళనాట హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా.. ‘టాప్ గన్ మావెరిక్’ యూఎస్‌లో 2022లో హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలవడం మరో విశేషం.
Leave a comment