Balayya: టాలీవుడ్ సీనియర్ హీరోలలో స్టార్స్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారు చిరంజీవి, బాలకృష్ణ. వీరిద్దరి వయస్సు ఆరు పదులు దాటిన కూడా కుర్ర హీరోలకి పోటీగా సినిమాలు చేస్తున్నారు. బాలయ్య మాస్ సినిమాలతో అలరిస్తుండగా, చిరంజీవి సామాజిక అంశాల నేపథ్యంలో చిత్రాలు చేస్తున్నారు. ఒకప్పుడు ఈ ఇద్దరు హీరోల మధ్య విపరీతమైన పోటీ ఉండేది. సంక్రాంతి బరిలో వీరిద్దరు పలుమార్లు పోటీ పడగా, బాలయ్యనే ఎక్కువ శాతం విజయం వరించింది.ఇక వీరిద్దరు వ్యక్తిగతంగా మంచి స్నేహితులు. అవసరం వచ్చినప్పుడు సాయం కూడా చేసుకుంటారు. బాలకృష్ణ వందో సినిమా గౌతమి ఫుత్ర శాతకర్ణి సినిమా ఈవెంట్‌కి చిరంజీవిని బాలయ్య ఆహ్వానించగా ఒక్క క్షణం ఆలోచించకుండా వస్తానని మాట ఇచ్చాడు చిరు.
ఇక ఈవెంట్లో చిరు, బాలయ్యల సందడి ఏ రేంజ్లో ఉందో మనం చూశాం. ఇక ఇదిలా ఉంటే ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ తో బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ తో పోటీ పడ్డారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన రెండు చిత్రాలు కూడా మంచి విజయం సాధించాయి. బాక్సఫీస్ దగ్గర భారీ వసూళ్లే రాబట్టాయి. ఇప్పటి వరకు వీరిద్దరు బాక్సాఫీస్ దగ్గర 15 సార్లు పోటీ పడ్డారు. అయితే బాలయ్య బాబు చిరంజీవితో పోటా పడ్డా కూడా ఆయన సినిమాలపై ఎంతో ఇష్టం చూపిస్తారు. చిరంజీవి నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ అంటే బాలయ్యకి చాలా ఇష్టమట. సోషియా ఫాంటనీ నేపథ్యంలో రూపొందినఈ సినిమాని బాలయ్య బాబు కనీసం 20 సార్లు అయినా చూసి ఉంటాడట. ఈ విషయాన్ని బాలయ్యే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీ చిరస్థాయిగా ఈ చిత్రాన్ని గుర్తించుకోవచ్చు అని బాలయ్య ఓ సందర్భంలో అన్నారు. చిత్రంలో చిరంజీవి నటన, శ్రీదేవి అందం, సెట్టింగ్స్ ,పాటలు ఇలా ప్రతి ఒక్కటి కూడా తనకి ఎంతగానో నచ్చాయని బాలయ్య చెప్పుకొచ్చారు. చిరంజీవి సినిమా గురించి బాలయ్య ఇంతలా గొప్పగా చెప్పడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. ఇక బాలయ్య ప్రస్తుతం తన 108వ సినిమాతో బిజీగా ఉండగా, చిరంజీవి భోళా శంకర్ అనే చిత్రం చేస్తున్నాడు.