Varun Tej: మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్ ఫిలిం ‘గని’ ఊహించని షాక్ ఇచ్చింది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో, కొత్త దర్శకుడు భారీ స్టార్ కాస్టింగ్, హై టెక్నికల్ వాల్యూస్‌తో తీసిన ‘గని’ భారీ అంచనాలతో బాక్సాఫీస్ బరిలో దిగింది.
కట్ చేస్తే.. అంచనాలను తలకిందులు చేస్తూ డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతలకు 23 కోట్ల మేర నష్టాలు వచ్చాయి. ఈ మూవీతోనే ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ అన్న అల్లు బాబీ తన స్నేహితుడితో కలిసి ప్రొడక్షన్ స్టార్ట్ చేసాడు. దీంతో తర్వాతి సినిమా విషయంలో ఆచి తూచి అడుగేస్తున్నాడు వరుణ్ తేజ్.
ప్రస్తుతం మళ్లీ ట్రాక్‌లోకి రావడానికి కథలు వినే పనిలో ఉన్నాడు. ఈ ప్రాసెస్‌లో ‘రన్ రాజా రన్’, ‘సాహో’ సినిమాలతో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ సుజీత్ చెప్పిన స్టోరీ లైన్ వరుణ్‌కి నచ్చిందని తెలుస్తోంది.
కథ నచ్చి పూర్తి స్క్రిప్ట్ రెడీ చెయ్యమని వరుణ్ తేజ్, సుజీత్‌కి చెప్పాడని.. ప్రస్తుతం సుజీత్ అదే పనిలో ఉన్నాడని.. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని ఫిలింనగర్ టాక్.
Leave a comment