Salaar: ఆదిపురుష్‌తో తీవ్ర నిరాశపరచిన ప్రభాస్ సెప్టెంబర్ 28న సలార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రశాంత్ నీల్- ప్రభాస్ కాంబినేషన్లో మూవీ కావడంతో చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇటీవల చిత్ర టీజర్ విడుదలై అంచనాలు మరింత పెంచింది. చిత్రాన్ని రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయనుండగా, మొదటి పార్ట్ `యుద్ధ విరమణ` పేరుతో విడుదల కానుంది. దీనికి సంబంధించిన టీజర్ గూస్బంప్స్ తెప్పించడంతో పాటు రికార్డుల వేట మొదలు పెట్టింది. ఒక్క రోజులో ఇది 83 మిలియన్స్ వ్యూస్‌ని సాధించి ఎవరికి అందని రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులలో ప్రభాస్ పెద్దగా కనిపించకపోయిన కూడా టీజర్ మాత్రం చాలా మందికి నచ్చేసింది.
ట్రైలర్‌తో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచనున్నాడు ప్రశాంత్ నీల్. అయితే తాజాగా సినిమా కథ లీక్ అయినట్టు తెలుస్తుంది. 1980లో సున్నపు రాయి మాఫియా నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడట ప్రశాంత్ నీల్. సున్నపు రాయి ఫార్మాకి, యూఎస్ ఆర్మీకి లింక్ ఉన్న నేపథ్యంలో యూఎస్ ఆర్మీతో సలార్ పోరాడాల్సి వస్తుందని తెలుస్తుంది. యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకి గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం. యాక్షన్ సీన్స్ అన్ని కూడా దాదాపు విదేశాలలో చిత్రీకరించినట్టు తెలుస్తుంది. `కేజీఎఫ్2`, చిత్ర కథకి ఓ సంబంధం ఉంటుందట. సలార్ చిత్రం కూడా ప్రశాంత్ నీల్ యూనివర్స్ లో భాగమే `సలార్` అని తెలుస్తుంది.
సలార్` టీజర్ చూసి కొంతమంది విశ్లేషకులు `కేజీఎఫ్`చిత్రంతో లింకులున్నాయి అని చెప్పారు. సెట్, టోన్, ఆయుధాలు ఇలా చాలా విషయాలో రెండింటికి సంబంధం ఉందని అర్ధం అవుతుంది . అయితే `సలార్ 2`లో `కేజీఎఫ్` ,సలార్ లింక్ ఏంటనేది స్పష్టంగా తెలుస్తుందని అంటున్నారు. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది. సుమారు 400కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుండగా, ఈ చిత్రాన్ని ఐదు ఇండియన్ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. `బాహుబలి2` రికార్డుల టార్గెట్‌గా ఈ సినిమా రాబోతుందని కొందరు సినీ విశ్లేషకులు అంటున్నారు.