OTT: కరోనా సమయంలో వినోదం లేక చాలా ఇబ్బంది పడ్డ ప్రేక్షకులకి ఇప్పుడు వారి అంచనాలకి మించిన వినోదం దక్కుతుంది. ఒకవైపు థియేటర్లో మరోవైపు ఓటీటీలో ఫుల్ వినోదం అందుతుంది. గతవారం సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి మొత్తంగా 19 ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో బేబి సినిమా మాత్రం మంచి విజయం సాధించి ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇక ఈ వారం కూడా పెద్ద సినిమాల హడావిడి లేకపోవడంతో చిన్న సినిమాలు క్యూ కట్టాయి. వాటిలో హిడింబ అనే తెలుగు సినిమా, ‘స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్స్ వర్స్’ మూవీపై అంచనాలు ఉన్నాయి. ఇక వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ నటించి బవాల్ డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది. దీనిపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.
థియేటర్లో ఈ వారం రిలీజ్ లు చూస్తే..హిడింబ – జులై 20న విడుదల కానుంది.అశ్విన్ హీరోగా, అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.అన్నపూర్ణ ఫోటో స్టూడియో – జులై 21న ,విజయ్ అంటోని నటిస్తున్నహత్య- జూలై 21న రిలీజ్ కానున్నాయి. ఇక వీటితో పాటు ఒప్పెన్ హైమర్ – జులై 21న విడుదల, . హర్: చాప్టర్ 1 – జులై 21న విడుదల, అలా ఇలా ఎలా – జులై 21న విడుదల, కాజల్ కార్తీక – జులై 21న విడుదల, జిలేబి- జులై 21న విడుదల, నాగద్వీపం- జులై 22న విడుదల కానుంది. ఈ చిత్రాలన్నీ థియేటర్ లో రిలీజ్ కానుండగా, ఏ చిత్రం ఎక్కువ ఆదరణ దక్కించుకుంటుందా అని ప్రేక్షకులు గమనిస్తున్నారు.
ఇక ఓటీటీల విషయానికి వస్తే.. అమెజాన్ ప్రైమ్ లో బవాల్ (హిందీ) – జులై 21న విడుదల, నెట్‌ఫ్లిక్స్ లో ది డీపెస్ట్ బ్రెత్ (హాలీవుడ్)- జులై 19న విడుదల, అశ్విన్స్ (తెలుగు)- జులై 20న విడుదల, స్వీట్ మంగోలియాస్ (వెబ్ సిరీస్) – జులై 20న విడుదల, ది క్లోన్డ్ టైరోన్ (హాలీవుడ్) – జులై 21న విడుదలన స్ట్రీమింగ్ కానుంది. ఇక జీ5లో స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్స్ వర్స్ (యానిమేషన్) – జులై 18 నుండి స్ట్రీమింగ్ కానుంది. జియో సినిమాలో ట్రయల్ పీరియడ్ (హిందీ) – జులై 21న విడుదల, స్పెషల్ ఒప్స్: లయనెస్ – జూలై 23న స్ట్రీమింగ్ కానున్నాయి.