Vikram 50 Days: విశ్వ నటుడు, లోక నాయకుడు కమల్ హాసన్ కొంత గ్యాప్ తర్వాత సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. వయసుతో సంబంధం లేకుండా ‘విక్రమ్’ లాంటి యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకాభిమానులను అలరించారు.
తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసిందీ సినిమా. లోకేష్ కనకరాజ్ దర్శకత్వ ప్రతిభ, రోమాలు నిక్కబొడుచుకునే యాక్షన్ సీన్స్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, ఏజెంట్ టీనా, సినిమా చివర్లో ‘రోలెక్స్ సార్’ గా సూర్య అదిరిపోయే ఎంట్రీ, విజువల్స్, అనిరుధ్ సాంగ్స్ అండ్ ఎక్స్ట్రార్డినరీ బ్యాగ్రౌండ్ స్కోర్ ‘విక్రమ్’ ని వేరే లెవల్‌కి తీసుకెళ్లాయి.
జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైన ‘విక్రమ్’ అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్‌కి చేరుకుని అందరికీ లాభాలు పంచింది. నైజాంలో యంగ్ హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు. తమిళనాట ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది ‘విక్రమ్’. జూలై 22 నాటికి విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంటోంది.
కథలో కార్తి ‘ఖైది’ లోని ఢిల్లీ క్యారెక్టర్ని ఇన్వాల్వ్ చెయ్యడం, ‘రోలెక్స్’ గా సూర్య కంటిన్యూ అవుతాడని హింట్ ఇవ్వడంతో పాటు తర్వాతి పార్ట్ దీన్ని మించి ఉంటుందని చెప్పి డైరెక్టర్ లోకేష్ ‘విక్రమ్’ సీక్వెల్ మీద అంచనాలు పెంచేశారు. చాలా కాలం తర్వాత, యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా ‘విక్రమ్’ ఇచ్చిన డబుల్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు కమల్ హాసన్.
Leave a comment