Abhay Ram: యంగ్ టైగర్ ఎన్టీఆర్, భార్య లక్ష్మీ ప్రణతి దంపతుల కుమారులు అభయ్ రామ్, భార్గవ రామ్లకి సంబంధించిన పిక్స్ కానీ, లేటెస్ట్ న్యూస్ కానీ తెలిసిందంటే మాత్రం తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేసేస్తుంటారు. ఇక వారి బర్త్‌డే వచ్చిందంటే హంగామా మామూలుగా ఉండదు.
శుక్రవారం (జూలై 22) ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ పుట్టినరోజు.. 2014 జూలై 22న జన్మించిన అభయ్ రామ్ ఈ ఏడాదితో ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాడు. తమ అభిమాన నటుడి ముద్దుల తనయుడుకి విషెష్ చెబుతూ ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో అభయ్ రామ్ ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
అభయ్ రామ్‌కి నందమూరి ఫ్యాన్స్‌తో పాటు, సినీ ఇండస్ట్రీ వారు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తో డబుల్ హ్యాట్రిక్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్న యంగ్ టైగర్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేస్తూ.. కొరటాల శివ దర్శకత్వంలో నటించబోయే తర్వాతి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. తర్వాత ‘కె.జి.యఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్తోనూ ఓ మూవీ కమిట్ అయ్యారు.
Leave a comment