National Film Awards 2020 : 2020 సంవత్సరానికి గానూ నేషనల్ అవార్డ్స్ ప్రకటించారు. 68వ జాతీయ అవార్డుల ప్రకటనతో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ మరియు మలయాళ సినిమా పరిశ్రమ వర్గాల్లో ఆనందం నెలకొంది. సోషల్ మీడియా వేదికగా విజేతలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటివరకు ప్రకటించిన వాటిలో తెలుగులో బెస్ట్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో ‘కలర్ ఫొటో’ తో పాటు ‘నాట్యం’ సినిమాకు బెస్ట్ కొరియోగ్రఫీ (సంధ్య రాజు), బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ (టివి రాంబాబు) కేటగిరీల్లో రెండు అవార్డులు వచ్చాయి. ‘అల..వైకుంఠపురములో’ (సాంగ్స్) కి గానూ థమన్‌కి అవార్డ్ అనౌన్స్ చేశారు.
సూర్య, సుధ కొంగర కాంబినేషన్లో వచ్చిన సెన్సేషనల్ ఫిలిం ‘సూరరైపోట్రు’ (ఆకాశం నీ హద్దురా) ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిలిం తమిళ్ (2డి ఎంటర్టైన్మెంట్), బెస్ట్ యాక్టర్ (మేల్-సూర్య), బెస్ట్ యాక్టర్ (ఫీమేల్-అపర్ణ బాలమురళి), బెస్ట్ స్క్రీన్‌ప్లే (సుధ కొంగర), బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్ (జివి ప్రకాష్) కేటగిరీల్లో ఈ చిత్రాన్ని ఐదు అవార్డులు వరించాయి .
మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రానికి నాలుగు అవార్డులు వచ్చాయి. దర్శకుడు దివంగత సాచీ బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (బిజు మీనన్), బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (నంజనమ్మ), బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ (మాఫియా శశి) లను అవార్డులు వరించాయి. హిందీలో ‘తానాజీ’ చిత్రానికి గానూ అజయ్ దేవ్‌గణ్‌ను బెస్ట్ యాక్టర్ అవార్డ్‌కు ఎంపిక చేశారు. బెస్ట్ కన్నడ ఫిలిం కేటగిరీలో డొళ్లు (Dollu) సెలెక్ట్ అయింది.
Leave a comment