Amani: తెలుగు సినీ పరిశ్రమలో తన అందం, అభినయంతో పాటు ఎంతో మంది ప్రేక్షకుల మనస్సులు కొల్లగొట్టిన అందాల భామ ఆమని.అచ్చ తెలుగు ఆడపడుచులా ఆమని ప్రతి ఒక్కరికి ఎంతగానో కనెక్ట్ అయింది. అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ వరుస సినిమాలు చేసిన ఆమని ఏ మాత్రం అందాల ఆరోబోతలు లేకుండానే అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది . మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం, జంబలకిడి పంబ, శుభ సంకల్పం లాంటి ఎన్నో మరపురాని సినిమాలు చేసిన ఆమని తన కెరీర్లో గుర్తుండిపోయే సినిమాలు చేసింది. అయితే పెళ్లయ్యాక సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చిన ఆమని ఇప్పుడు మళ్లీ సపోర్టింగ్ రోల్స్ లో అలరిస్తుంది.
హీరోయిన్గా పదేళ్ల పాటు సత్తా చాటే అవకాశం ఉన్నా కూడా ఆమని పెళ్లి చేసుకొని తన కెరీర్ మొత్తం నాశనం చేసుకుంది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేయగా, ఇప్పుడు అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమని మాట్లాడుతూ.. నా కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే మా ఇంట్లో వాళ్లు పెళ్లి చేసేసారు. పేరెంట్స్ మాట కాదనలేక నేను కూడా పెళ్ళికి చేసుకున్నాను. అయితే పెళ్లి చేసుకునే ముందు నా భర్త నాకు కొన్ని షరతులు పెట్టాడు. నేను పెళ్ళయాక సినిమాలు మానేయాలని చెప్పడం, దీనికి నేను వెంటనే ఒప్పుకున్నాను.
ఆ సమయంలో నాతో సినిమాలు చేసేందుకు పెద్ద పెద్ద బ్యానర్స్ మరియు స్టార్ హీరోలు రెడీ గా ఉన్ప్పటికీ పెళ్లి చేసుకోవడం వలన అవన్నీ కూడా పోయాయి. అసలు పెళలి చేసుకొని కెరీర్ వదులుకున్నందుకు చాలా బాధపడ్డాను. పెళ్లి చేసుకున్న తర్వాత నేను నా భర్త సినిమాలు మానేయమంటే ఎలా ఒప్పుకున్నానో అని ప్రతి రోజు ఎంతో బాధపడ్డాను. పెళ్లి చేసుకొని పెద్ద తప్పు అయితే చేశారు. సినిమాలు మానేయమంటే నేనే ఎలా ఒప్పుకున్నానని ప్రతి రోజు ఆవేదన చెందాను. అయితే పెళ్లై పిల్లలు పుట్టాక వారే లోకంగా బ్రతికాను. ఇక కొన్ని రోజుల తర్వాత సినిమాలలో నటించే అవకాశాలు వస్తుండడంతో ఆయనని అడిగాను. అప్పుడు సపోర్ట్‌గా నిలిచారు అని ఆమని చెప్పుకొచ్చింది.