Tarak: విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ .. బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాల రామాయణం సినిమాలలో బాల నటుడిగా కనిపించారు. ఆ తర్వాత నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. అక్కడ నుండి స్టూడెంట్ నంబర్ 1, ఆది, సింహాద్రి వంటి సినిమాలు చేసి స్టార్ హీరోగా ఎదిగారు. ఇక అశోక్, రాఖీ సినిమాలలో ఎన్టీఆర్ లుక్ గురించి ఏ రేంజ్ లో విమర్శలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ అంత బొద్దుగా కనిపించడానికి కారణం ఎన్టీఆర్ తల్లి షాలిని అని అంటుంటారు. ఆమె వంటలు అద్భుతంగా చేసేవారు. ఆ కారణం వల్లనే ఆయన అంత లావు అయ్యారట.
తారక్ బరువు పెరగడానికి ఎన్టీఆర్ సినిమాలకి ఫైట్ మాస్టర్ విజయ్ భార్య కూడా ఓ కారణః అంటారు. ఆమె కూడా వంటలు బాగా చేసేవారు. విజయ్ తారక్ కలిసి భోజనం చేసే సమయంలో విజయ్ భార్య వండిన వంటకాలను తారక్ ఫుల్గా లాగించేవాడట. దాంతో తారక్ లుక్ మారిపోయింది. అయితే ఆ తర్వాత సన్నగా కావడం కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడ్డారు.ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని సన్నబడ్డారు. సర్జరీ చేయించుకున్నట్టు ప్రచారాలు జరిగిన అవన్నీ అవాస్తవాలు అని ఎన్టీఆర్ ఖండించారు. సన్నబడ్డ తర్వాత ఎన్టీఆర్ తన బాడీని చాలా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు. బరువు తగ్గడానికి ఎంతో కష్టపడిన తారక్, మళ్లీ పెరగకుండా ఉండడం పై ప్రత్యేక దృష్టి పెడుతునన్నారు
బరువు తగ్గినప్పటి నుంచి ఎన్టీఆర్ ఒకటే డైట్ ఫాలో అవుతున్నాడని ఆ కారణంగానే ఆయన ఫిజికల్ ఫిట్నెస్ లో మార్పు రావడం లేదని అంటున్నారు .ఎన్టీఆర్ ఉదయం లేవగానే యోగా గాని వర్కౌట్ గాని రెండు గంటలపాటు చేస్తారట. అనంతరం ఉదయం రెండు గ్లాసుల రాగి జావా తాగి, ఆ తర్వాత నానబెట్టిన బాదం పప్పు వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారట. రోజు రెండు కోడిగుడ్లు, మధ్యాహ్న భోజనంలో కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువగా ఉండేలా రాగి సంకటి, నాటుకోడి వంటివి తింటారట. ఇక రాత్రిపూట నానబెట్టిన మొలకలు వచ్చిన తృణధాన్యాలు తప్ప మరేమి తినరట. ఆకలి అనిపించినప్పుడు జ్యూస్లు తాగుతారట.