Chalaki Chanti: బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు చలాకి చంటి. తనదైన కామెడీతో కడుపుబ్బ నవ్వించే చలాకి చంటి తొలుత ఓ రేడియో స్టేషన్ లో జాకీగా పని చేసి ఆ తర్వాత సినిమాల్లో కమెడియన్ గా కెరీర్ ప్రారంభించారు. ఈటీవీ ‘జబర్దస్త్’తో బుల్లితెరపై ఆయనకి మంచి క్రేజ్ దక్కింది. చలాకి చంటిగా తెలుగు ప్రేక్షకుకలకి చాలా దగ్గరయ్యారు. ఈటీవీ ప్లస్‌లో ‘నా షో నా ఇష్టం’ అనే కామెడీ ఎంటర్ టైనర్ షోకు హోస్ట్ గా చేసిన చంటి ఆ తర్వాత బిగ్ బాస్ షోలోను వినోదం పంచాడు. ‘బిగ్బాస్స సీజన్ 6లో ఓ కంటెంస్టెంట్‌గా పాల్గొని మరింత క్రేజ్ దక్కించుకున్నాడు.
టీవీ షోలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చలాకీ చంటి సినిమాల్లో హాస్య నటుడిగా రాణించారు. ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘సినిమా చూపిస్త మావ’ లాంటి చిత్రాల్లో తనదైన శైలి కామెడీ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే బిగ్ బాస్ కోసం వెళ్లిన చలాకి చంటి స్టార్ మా రూల్స్ ప్రకారం ఏడాది పాటు అక్కడే పని చేశాడు. తాజాగా అగ్రిమెంట్ పూర్తి కావడంతో తిరిగి జబర్ధస్త్‌లోకి కూడా రీఎంట్నీ ఇచ్చాడు.ఇప్పటికే ఆయన రెండు మూడు సార్లు జబర్ధస్త్‌ని వదిలి వెళ్లాడు. అయితే జబర్ధస్త్ ని వదిలి బిగ్ బాస్ కి వెళ్లిన చాలా మంది మాటీవీలో బాగానే సెటిల్ అయ్యారు. కాని చంటి మాత్రం సరిగా వాడుకోలేకపోయాడు.
ఇటీవల చలాకి చంటి గుండెపోటుతో ఆసుపత్రలో అడ్మిట్ అయిన విషయం తెలిసిందే. ప్రాణాపాయ స్థితి నుండి చంటి బయటపడ్డాడడని అప్పట్లో జోరుగా వార్తలొచ్చాయి. అనారోగ్యం వలన చలాకీ చంటి మూడు నెలల పాటు బుల్లితెరకు దూరమయ్యాడు. ఇక మూడు నెలల గ్యాప్ అనంతరం సుమ అడ్డా షోలో ప్రత్యక్షమయ్యాడు చంటి. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ సన్నీ, సిరి, కాజల్ తో పాటు చంటి సుమ అడ్డా షోకి రాగా, చంటి కాస్త డల్‌గానే కనిపించిన కూడా గతంలో మాదిరి పంచ్‌లు వేశాడు. ఇప్పుడు చంటి మరింత బరువు తగ్గి కనిపిస్తున్నారు.. దీంతో ఆయన అభిమానులు మీ ఆరోగ్యం ఎలా ఉందని వాకబు చేస్తున్నారు.