Jr NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి (52) ఆగస్టు 1న మరణించిన సంగతి తెలిసిందే. విదేశాల్లో ఉన్న పెద్ద కుమార్తె వచ్చిన తర్వాత ఆగస్టు 3వ తేదీన మహాప్రస్థానంలో నందమూరి-నారా కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.
ఉమా మహేశ్వరి మరణించినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లండన్ ట్రిప్‌లో ఉన్నారు. కుటుంబ సభ్యులంతా ఉన్నా ఆయన కనిపించలేదనే వార్తలు వైరల్ అయ్యాయి. అప్పటికే ఔట్ ఆఫ్ కంట్రీ అని తెలియడంతో.. సైలెంట్ అయ్యారు.
గురువారం మధ్యాహ్నం తారక్, తల్లి, భార్యతో కలిసి ఉమా మహేశ్వరికి నివాళులర్పించడానికి జూబ్లీ హిల్స్‌లోని ఆమె నివాసానికి వచ్చారు. వెంట అన్నయ్య కళ్యాణ్ రామ్ కూడా ఉన్నారు. ఉమా మహేశ్వరి అక్క, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా సోదరి నివాసానికి వచ్చారు.
Leave a comment