Soundarya: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సౌందర్య అంటే తెలియనివారుండరు. తన నటన, అందంతో ప్రేక్షకుల నుండి అభిమానంతో పాటు… తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి సౌందర్య తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయి.. తన అభిమానుల్ని శోకసంద్రంలో ముంచేసింది. సినీ నటి సౌందర్య చనిపోయి దాదాపుగా 19 ఏళ్ల పూర్తయ్యింది. ఇప్పటికీ సౌందర్య సినిమాలు, ఆమె టాపిక్ ఎక్కడో ఒకచోట వైరల్ అవుతూనే ఉంటాయి. ప్రస్తుతం సౌందర్య మరణం గురించి కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. సౌందర్య జాతకంలో జ్యోతిష్కులు ఓ విషయం చెప్పారట. సౌందర్య జాతకం చాలా బలమైందని.. తనకంటూ మంచి పేరు వస్తుందని.. కానీ ఆమెకు అకాల మరణం సంభవిస్తుందని అన్నారట. ఆ జ్యోతిష్కుడు చెప్పినట్లే తన కూతురు మరణించిందని సౌందర్య తండ్రి బాధపడ్డారు. సౌందర్య మరణం వెనుక ఓ శక్తి ఉందని అంటున్నారు. ఆ శక్తి మరేదో కాదు.. ఆమె కన్నడ భాషలో నటించిన నాగవల్లి పాత్ర. తెలుగులో చంద్రముఖిగా వచ్చిన ఈ సినిమాని కన్నడలో ఆప్తమిత్ర అనే పేరుతో సినిమాను ప్లాన్ చేశారు.
సౌందర్య ఇందులో నాగవల్లీ అనే పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా షూటింగ్ టైమ్ లో సౌందర్య ఆ నాగవల్లీ పాత్రలో బాగా లీనమైపోయారట. కనుక నాగవల్లీ క్యారెక్టర్ చేయడం వల్లే సౌందర్య మరణించిందనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఖచ్చితంగా సౌందర్య మరణం వెనుక ఆ శక్తి దాగి ఉందని.. జ్యోతిష్కులు కూడా చెబుతున్నారు. ఇక ఆప్తమిత్ర 2 మూవీలో నటించిన హీరో విష్ణువర్థన్ ఆ సినిమాలో యాక్ట్ చేసినంత కాలం ఆరోగ్యంగా బాగానే ఉన్నారు. కానీ ఈ సినిమా పూర్తయిన తర్వాత సడెన్ గా మరణించారు.
అంతేకాదు.. నాగవల్లీ పాత్రకు డబ్బింగ్ చెప్పిన శశికళ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను చాలా మూవీస్ కు డబ్బింగ్ చెప్పాను. కానీ నాగవల్లీ పాత్రకు డబ్బింగ్ చెప్పినప్పటి నుండి తన చుట్టూ ఏదో తెలియని శక్తి ఉన్నట్లు అనిపిస్తుందని.. ఒక టైమ్ లో అయితే కారణం లేకుండానే సూసైడ్ చేసుకోవాలనుకున్నానని చెప్పింది. ప్రజంట్ దీనికి సంబంధించిన వార్త కన్నడ సినీ ఇండస్ట్రీతో పాటుగా టాలీవుడ్ లోనూ వైరల్ అవుతుంది. మరి నాగవల్లీ పాత్ర వెనుక నిజంగా ఏదైనా శక్తి ఉందా.. లేదా.. అనేది తెలియాలి.