SKN: పదేళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై జీవిత, రాజశేఖర్‌లు సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. వారి అనుచిత వ్యాఖ్యలపై సీరియస్ అయిన అల్లు అరవింద్ వారిద్దరిపై కేసు వేయగా, ఇటీవల వారికి జైలు శిక్ష కూడా విధించారు. అయితే జీవిత రాజశేఖర్ బెయిలు తెచ్చుకొని పై కోర్టుకి వెళ్లారు. అయితే ఈ విషయంపై బేబీ ఈవెంట్ లో చిరంజీవి ముందు నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. ఎస్కేఎన్ మాట్లాడుతూ.. మంచితనం ఒక శిఖరం అయితే మెగాస్టార్ ఎవరెస్ట్ లాంటి వారు అని ఆయన అన్నారు. చిరంజీవి గారిని ఎవరు కామెంట్ చేసిన కూడా దగ్గరకు తీసే స్వభావం చిరంజీవి ఆయనది. తిట్టిన వాళ్ళే ఓ మూడు నెలల తర్వాత ఆయన దగ్గరికి సాయం కోసం వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
అవేమి చిరంజీవి పట్టించుకోకుండా వారిని దగ్గరకు తీసుకోవడం, వారితో ఫోటో కూడా దిగారు. చిరంజీవి చేసే సేవా కార్యక్రమం బ్లడ్ బ్యాంక్‌పై కూడా విమర్శలు చేసిన వారు ఉన్నారు. అలా కామెంట్ చేసిన వాళ్లకి ఈ మధ్యే జైలు శిక్ష పడిందని రాజశేఖర్, జీవితలపై ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేశాడు బేబి నిర్మాత. చిరంజీవి గారిని ఎవరు ఏమన్నా కూడా మా మా ఫ్యాన్స్ బ్లడ్ బాయిల్ అయిపోతుంది. సోషల్ మీడియా ప్రాచుర్యంలోకి వచ్చాక మా ఫ్యాన్స్ అంతా ఎడ్యుకేట్ అయి విమర్శల్ని ఎలా తిప్పి కొట్టాలో నేర్చుకున్నాం అని చెప్పుకొచ్చారు.
ఆంజనేయుడికి ఆయన బలం ఎలాగ తెలియదో..చిరంజీవి గారికి ఆయన శక్తి, ఆయన అభిమానుల శక్తి తెలియదు అంటూ స్టన్నింగ్ కామెంట్స్ చేశారు. ఇలా మెగాస్టార్ ముందే జీవిత రాజశేఖర్ జైలు శిక్ష గురించి బేబి నిర్మాత ఇలా ఓపెన్ కామెంట్స్ చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. కాగా, బేబి మూవీ సాధించిన విజయానికి గాను బేబి కల్ట్ వేడుక నిర్వహించగా, ఈ కార్యక్రమానికి చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వెళ్లారు.