Rajamouli: తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి. అలాంటి పాన్ ఇండియా రేంజ్ ఆఫ్ డైరెక్టర్ ను రాళ్లతో కొట్టడం ఏంటి అని ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా నివ్వెరపోతున్నారు. నిజానికి ఈ విషయం ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు, మరి రాజమౌళిని రాళ్లతో ఎందుకు కొట్టారు.. ఎవ్వరు కొట్టారో తెలుసుకుందాం. రాజమౌళి సినిమాలంటే ఓ బ్రాండ్ అని మార్క్ వేసుకున్నారు. తన 20 ఏళ్ల సినీ కెరీర్ లో తెరకెక్కిన సినిమాలు తక్కువే.. కానీ ఆయన తీసిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వీటిల్లో విక్రమార్కుడు సినిమా కూడా ఒకటి. మాస్ హీరో రవితేజ సినీ కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా.
ఈ సినిమా కూడా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి హిట్ అందుకుంది. ఈ మూవీ షూటింగ్ ను కేవలం మూడు నెలల్లోనే కంప్లీట్ చేశారు. షూటింగ్ లో కొన్ని షెడ్యూల్స్ ను కర్ణాటకలో క్వారీలో ప్లాన్ చేశారట. అయితే ఆ క్వారీలో కొంతమంది కూలీలు.. షూటింగ్ టైమ్ లో ఖాళీగా కూర్చుకున్నారట. పైగా ఆ క్వారీ ఓనర్ వారికి డబ్బులు ఇవ్వలేదని చాలా అసంతృప్తిగా ఉన్నారట. ఏం చేయాలో తెలియక.. ఇదిగో ఈ సినిమా వల్లే మా పని పోయిందని.. అందుకే డబ్బులు రాలేదనే కోపంతో అక్కడికి వచ్చిన సినిమా యూనిట్ వారిపై రాళ్లతో కొట్టారట.
అందులోనే రాజమౌళి కూడా ఉండటంతో చాలా తీవ్రంగా దెబ్బలు తగిలాయి. అలా ఈ విషయం ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎవ్వరికీ తెలీదు. ఏది ఏమైనా అన్ని సమస్యలు, కష్టాలు తట్టుకున్నారు కనుకే రాజమౌళి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ నెక్ట్స్ మహేష్ బాబుతో ఓ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని సమాచారం.