ఆయన పాట అమృతం, ఆయన గాత్రం అమరం. ఆర్టిస్టులకు డబ్బింగ్ చెప్పినా.. పాట పాడినా ఆయనకు సాటి వచ్చేవారు ఎవరు లేరు. రారు.. బాలు గారు పాడిన పాటలకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు దక్కించుకున్నారు. అలాంటి సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారిపై ఎవరో చేతబడి చేయించారని ఓ వార్త వచ్చింది. ఎస్పీ బాలు గారు గీతాంజలి సినిమాలో ఓ పాట పాడేటప్పుడు గొంతు పాడై.. హాస్పిటల్ కి వెళ్తే.. ఒక మేజర్ సర్జరీ చేయాలి.. లేదంటే మీరు పాటలు పాడలేరని అన్నారట. ఆ విషయం అంతగా పట్టించుకోని బాలు గారు.. గీతాంజలి మూవీలో ఓ సాంగ్ రికార్డింగ్ కు వెళ్లారు.
ఆ సాంగ్ రికార్డింగ్ లో గొంతు చాలా ఇబ్బంది పెట్టిందట. అందుకే ఆ సాంగ్ రికార్డింగ్ పూర్తి అవ్వడానికి నాలుగు రోజులు పట్టిందట. ఈ విషయం తెలిసిన బాలు గారి భార్య సావిత్రి ఏంటంటి.. మీ గొంతు ఇలా మారింది. ఈ మధ్యకాలంలో ఎవరైనా హై రేంజ్ ఉన్న హీరోతో గొడవలు ఏమైనా వచ్చాయా.. ఆ హీరో మీ గొంతుకు చేతబడి గానీ చేయించారా ఏంటి.. అని అడిగారట. ఆ మాటలకు బాలు గారు నవ్వుకుని.. అలాంటిదేవి లేదు అని చెప్పి.. ఆ తర్వాత గొంతుకు సర్జరీ చేయించుకున్నారు. ఆ తర్వాత కూడా సినిమాల్లో ఎన్నో పాటలు పాడి ఆయనకు ఉన్న ఇమేజ్ ను మరింత పెంచుకున్నారు. అయితే బాలు గారి భార్య అన్న మాటలు మాత్రం అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి.