Niharika: కొద్ది రోజుల క్రితం మెగా డాటర్ నిహారిక తన డైవర్స్ విషయంపై అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కొన్నాళ్ల నుండి జరుగుతున్న ప్రచారాలని కన్ఫాం చేస్తూ తాను, చైతన్య విడాకులు తీసుకుంటున్నామని జూలై 5న ప్రకటించింది. ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకున్న నిహారిక పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకోవడం అందరిని ఆశ్చర్యపరచింది. పెళ్లి తర్వాత సినిమాలకి బ్రేక్ ఇచ్చిన నిహారిక విడాకుల తర్వాత నటిగా, నిర్మాతగా దూసుకుపోతుంది. ఇటీవల నిహారిక డేడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ లో నటించి సందడి చేసింది.విడాకుల తర్వాత నిహారిక ఆకాశమే హద్దుగా రెచ్చిపోతుంది. పలు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది.
ఇప్పుడు ఈ మెగా డాటర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని రెడీ అయ్యిందట నిహారిక. ఒక మనస్సు చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన నిహారిక ఆ తర్వాత పలు చిత్రాలలో కథానాయికగా నటించింది. కాని ఒక్క సినిమా కూడా నిహారికకి మంచి పేరు తీసుకురాలేదు. అయితే ఇప్పుడు తన టాలెంట్ ని మళ్లీ నిరూపించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉందట.ఈ క్రమంలోనే ఒక యంగ్ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ యువ డైరెక్టర్ కథని సిద్ధం చేసి నిహారికకి వినిపించగా ఆమె సినిమా చేసేందుకు సన్నద్ధమైనట్టు తెలుస్తుంది.
అయితే నిహారిక హీరోయిన్గా సినిమాల్లోకి రావడం మెగా కుటుంబానికి ఏ మాత్రం ఇష్టం లేదట. కానీ నిహారిక మాత్రం కుటుంబ సభ్యుల మాట కాదని తనకి నచ్చిన పని చేస్తుందట. అతి త్వరలోనే నిహారిక తన కొత్త సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనుందని కూడా అంటున్నారు. మరి రానున్న రోజులలో దీనిపై ఏదైన క్లారిటీ వస్తుందా అనేది చూడాలి. ఇక నిహారిక విడాకుల తర్వాత కొంచెం కూడా బాధ లేకుండా సరదాగా ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తుంది. నిహారిక వ్యవహరశైలి చూసి కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు.