Ileana: గోవా బ్యూటి ఇలియానా కొద్ది రోజులుగా తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి థ్రిల్ అందించింది. ఇలియానా తన ప్రియుడు పేరు వివరాలు చెప్పకుండా దోబూచులాడుతూ వచ్చింది. ఇక తాజాగా తను పండంటి కొడుక్కి జన్మనిచ్చినట్టు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఆగస్ట్ 1వ తేదిన తనకు బిడ్డ పుట్టిన పేర్కొన్న ఇలియానా శనివారం సాయంత్రం ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా తెలియజేసింది. అంతేకాదు ఆ బుడ్డోడి ఫేస్ రివీల్ చేస్తూ.. అతడినికి కోవా ఫీనిక్స్ డోలాన్ అని పేరు పెట్టినట్టు ఇలియానా తెలిపింది. ఇక ఓ ఎమోషనల్ నోట్ కూడా పోస్టు చేసింది.
ఈ ప్రపంచంలోకి మా బేబీ బాయ్‌ను ఆహ్వానించినందుకు మేము ఎంత సంతోషంగా ఉన్నామో పదాల్లో చెప్పలేం. మా మనసులు ఆనందంతో నిండిపోయాయి అంటూ తన పోస్ట్లోరాసుకొచ్చింది. అయితే భర్త ఎవరనేది చెప్పకుండా ఇలియానా ఇప్పటికీ సస్పెన్స్ లో పెట్టడం ఏ మాత్రం బాగోలేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అథియా శెట్టి, నర్గిస్ ఫక్రీ, సోఫీ చౌదరి సహా పలువురు నటీమణులు సోషల్ మీడియా ద్వారా కంగ్రాట్స్ అంటూ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఇలియానా తనయుడి పిక్ నెట్టింట హల్ చల్ చేస్తుంది.
అయితే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు అనుష్క శర్మ, అలియా భట్, ప్రియాంక చోప్రా జోన్స్ వంటివారు తమ పిల్లల ముఖాలను సోషల్ మీడియాలో కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. పూర్తిగా ఫేస్ కావర్ చేయడమో లేదంటే బ్లర్ చేయడమో చేసేవారు. కాని ఇలియానా మాత్రం చాల డేరింగ్‌గా తన బిడ్డ ముఖాన్ని ప్రపంచానికి చూపించి ఆనందం వ్యక్తం చేసింది. ఇలియానా గట్స్ కి కొందరు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇలియానా కెరీర్ విషయానికి వస్తే ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన ఇలియానా ప్రస్తుతం పెద్దగా ఆఫర్స్ అందుకోలేకపోతుంది. తెలుగులో అవకాశాలు లేవు. హిందీలో అప్పుడప్పుడు చిన్నా చితకా పాత్రలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇలియానా బిడ్డకు జన్మనిచ్చి ఫ్యామిలీతో సంతోషంగా జీవించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.