Home Film News Mega Family: మెగాస్టార్ ఫ్యామిలీతో వైరం.. సినిమా అవకాశాలు కోల్పోయిన నటులు వీరే
Film News

Mega Family: మెగాస్టార్ ఫ్యామిలీతో వైరం.. సినిమా అవకాశాలు కోల్పోయిన నటులు వీరే

Mega Family: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే మంచి క్రేజ్ ఉంటుంది. ఈ ఫ్యామిలీ నుండి ఎంతో మంది స్టార్ హీరోలు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చిరంజీవి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేసి ఎంతో మందికి సాయం చేశారు. అంతటి గుర్తింపు సంపాదించుకున్న మెగా ఫ్యామిలీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి గౌరవ మర్యాదలు దక్కించుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ అంటే ఇష్టపడేవాళ్లు ఉన్నట్లు.. మెగా ఫ్యామిలీ అంటే ఇష్టపడని వారు కూడా అంతే ఉన్నారు. మెగా కుటుంబంతో పలు వివాదాలు పెట్టుకుని సినిమాల్లో అవకాశాలు లేక సినీ ఇండస్ట్రీకి దూరమైన వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

ఉదయ్ కిరణ్.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిత్రం, నువ్వు నేను లాంటి సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకుని లవర్ బాయ్ గా పేరు సంపాదించుకున్నారు. ఉదయ్ కిరణ్ ను చిరంజీవి ఇష్టపడి మరీ తనను అల్లుడిగా చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవి పెద్ద కూతురు సుస్మితతో నిశ్చితార్థం కూడా ఎంతో ఘనంగా చేశారు. మరి ఏమైందో ఏమో తెలీదు గానీ ఆ తర్వాత ఉదయ్ కిరణ్ సుస్మితను పెళ్లి చేసుకోలేదు. ఉదయ్ కిరణ్ కు ఆ తర్వాత నుండి సినిమా అవకాశాలను కోల్పోయారు. ఆ తర్వాత ఉదయ కిరణ్ కు వివాహం జరిగింది. సినిమా అవకాశాలు లేక.. ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. నెక్ట్స్ శ్రీరెడ్డి. కాస్టింగ్ కౌచ్ గురించి సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల గురించి వారితో చేసిన చాటింగ్ విషయాలను కూడా బయటపెట్టింది. దగ్గుబాటి అభిరామ్ ను తిడుతూనే ఉంటుంది.

 

పవన్ కళ్యాణ్ ను కూడా ఆయన పెళ్లిళ్ల గురించి బూతులు తిట్టి సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయ్యింది. ఆమెకు సినిమాల్లో అవకాశాలు లేక యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుంది. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఏదొక పోస్ట్ చేస్తూ ట్రోల్స్ కి గురవుతుంది. చిన్ని కృష్ణ.. టాలీవుడ్ లో మంచి రైటర్ గా పేరు తెచ్చుకున్న చిన్న కృష్ణ కూడా చిరంజీవి ఫ్యామిలీని దారుణంగా కామెంట్స్ చేశారు. చిరంజీవి ఫ్యామిలీ ఎవర్ని దగ్గరకు తీసుకోదు అని.. సాయం చేయదు అని కామెంట్స్ చేశారు. ఆ తర్వాత రైటర్ గా తాను చేసిన కామెంట్స్ ఫేక్ అని తెలిసి.. సినిమా అవకాశాలు ఇవ్వలేదు. దాంతో మూవీస్ కు దూరమయ్యారు. ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పోసాని కృష్ణ మురళి వరుస సినిమాలలో నటించేవారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై కామెంట్ చేసినప్పటి నుండి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు లేక అడపాదడపా సినిమాలు చేసుకుంటున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...