Chiranjeevi: రామ్ చరణ్, ఉపాసన దంపతులకి జూన్ 20న చిన్నారి జన్మించిన విషయం తెలిసిందే. జూన్ 30న చిన్నారికి క్లింకార అని నామకరణం చేశారు. మెగా వారసురాలురాకతో ఇటు మెగా ఫ్యామిలీ.. అటు మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. ఇక చిరంజీవి సైతం తన మనవరాలిది అదృష్ట జాతకం అని చెబుతూ చాలా సంతోషించారు. అయితే మెగా ప్రిన్సెస్ పుట్టినప్పటి నుండి ఆ చిన్నారికి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంటుంది. అయితే అందరు సెలబ్రిటీల మాదిరిగానే రామ్‌చరణ్ దంపతులు కూడా క్లింకార ముఖాన్ని బయటకు చూపించడం లేదు.
బారసాల ఫొటోలతో పాటు కొన్ని ఇమేజెస్, వీడియోలను షేర్ చేసిన కూడా ఎక్కడ క్లింకార ఫేస్ కనిపించలేదు. క్లింకారకి ఎవరి పోలికలు వచ్చాయా అని అభిమానులు తెగ ఆరాలు తీస్తున్నారు. ఇటీవల సాయి ధరమ్ తేజ్.. క్లింకారకు తన తండ్రి పోలికలే వచ్చాయి. అచ్చం రామ్‌చరణ్ లాగే ఉంటుంది. కళ్లు మాత్రం చాలా బాగున్నాయి. అవి నాకు తెగ నచ్చేశాయి. అమ్మాయి తండ్రి పోలికలతో పుడితే అదృష్టమంటారు. క్లింకార విషయంలోనూ అదే జరిగింది అని సాయి ధరమ్ తేజ్ అన్నాడు. అయితే క్లింకార పుట్టిన తర్వాత చిన్నారికి పలువురు పలు రకాల గిఫ్ట్ లు అందిస్తున్నారు. చిరంజీవి ఏం ఇచ్చాడా అనే ఆసక్తి అందరిలో ఉండగా, రీసెంట్గా ఉపాసన ఈ విషయాన్ని రివీల్ చేసింది.
చిన్నారి క్లింకారకి చిరంజీవి-సురేఖ దంపతులు ఆంజనేయ స్వామి రూపంలో ఉన్న బంగారు డాలర్స్ ను అందమైన డిజైన్ తో తయ్యారు చేయించి గిఫ్ట్‌గా ఇచ్చారని ఉపాసన పేర్కొంది. చిరంజీవికి ఆంజనేయ స్వామి అంటే అమితమైన ప్రేమ. అందుకే తన మనవరాలకి కూడా ఇష్టదైవాన్నే ప్రతిరూపంగా గిప్ట్ ఇచ్చారు. ఇక ఉపాసన తల్లిదండ్రులు బంగారు ఊయలను గిఫ్ట్ ఇచ్చినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబాని కూడా బంగారు ఊయలని గిఫ్ట్‌గా ఇచ్చాడని ప్రచారం సాగింది. కాని దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు ప్రముఖులు కూడా కాస్ట్లీ గిఫ్ట్‌లు ఇచ్చారని చెబుతున్నారు.