Chiranjeevi Events: టాలీవుడ్ సీనియర్ హీరోలలో చిరంజీవి ఏడు పదుల వయస్సుకి దగ్గరగా ఉన్నాడు. అయినప్పటికీ ఎంతో ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి నటించిన చాలా సినిమాలు అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసాయి. ఇక ఖైదీ నెం 150 చిత్రంతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చిన చిరు ఇప్పడు తన జోరుని కొనసాగిస్తున్నారు. మరి కొద్ది రోజులలో భోళా శంకర్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించనున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గత రాత్రి గ్రాండ్ గా జరగగా, ఈ ఈవెంట్‌కి చిత్రంలో కథానాయికగా నటించిన తమన్నా డుమ్మా కొట్టింది. దీంతో చిరు సినిమాలకే హీరోయిన్స్ ఎందుకు డుమ్మా కొడుతున్నారన్న విషయం హాట్ టాపిక్‌గా మారింది.
చిరు నటించిన సైరా చిత్రంలో నయనతార కథనాయికగా నటించగా, ఆమె సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాలేదు. సాధారణంగా నయనతార ఎవరి సినిమా అయినా సరే ప్రమోషన్లకు పెద్దగా రాదు. దాంతో ఈ విషయాన్ని ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు. ఇక ఆ తర్వాత చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి కాజల్ కూడా డుమ్మా కొట్టింది.అయితే ఫైనల్ ఔట్‌పుట్‌లో కాజల్‌ని లేపేసారు కాబట్టి , చిత్రంలో ఆమె కథానాయికకపోవడంతో ఈవెంట్‌కి రాలేదని అందరు అనుకున్నారు. ఇక వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్‌కి శృతి హాసన్ డుమ్మా కొట్టింది. ఆ సమయంలో చిరు.. శృతిపై సెటైర్స్ వేశారు. ఈ ఈవెంట్ ముందు రోజు జరిగిన వీరసింహారెడ్డిలో మెరిసిన శృతి వాల్తేరు వీరయ్యకి మాత్రం రాలేదు.
ఇక రీసెంట్ గా జరిగిన భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిత్ర కథానాయిక తమన్నా డుమ్మా కొట్టేసింది. చిత్రంలో చిరంజీవికి చెల్లిగా నటించిన కీర్తి సురేష్ రాగా, తమన్నా హాజరు కాకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల ముందు చిరంజీవితో ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా సడెన్‌గా అంత పెద్ద ఈవెంట్‌కి డుమ్మా కొట్టడం వెనక కారణం ఏంటని సోషల్ మీడియాలో చర్చలు జరుపుతున్నారు.ఏదేమైన గత కొద్ద రోజులుగా హీరోయిన్స్ ఇలా చిరంజీవి సినిమాలకి డుమ్మా కొట్టడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది.