NTR: తెలుగు సినిమా చరిత్రలో నందమూరి తారక రామారావు అందరికీ సుపరిచితులే. ఆయన సినిమాలు ఎన్నో ఇప్పటికీ నేటి తరానికి కూడా రామారావు అంటే ఎంతో అభిమానం. మరెంతో గౌరవం. సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఎన్టీఆర్ శ్రీరాముడిగా, శ్రీ కృష్ణుడిగా, రావణాసురుడిగా, దుర్యోదనుడిగా ఇలా ఏ పౌరాణిక పాత్ర వేయాలన్నా అది ఎన్టీఆర్ మాత్రమే అనేలా ఎంతో హుందాగా ఉండేది. ఇప్పుడు రాముడు, కృష్ణుడు అంటే సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే అనేలా ఆయన రూపం మాత్రమే గుర్తుకు వస్తుంది. కేవలం హీరోలే కాకుండా ఆయన ఏ పాత్రలో నటిస్తే.. ఆ పాత్రకు కచ్చితంగా న్యాయం చేస్తారు. పాత్ర ఏదైనా.. ఎంత కష్టమైనా సరే ఆ పాత్రకు నూటికి నూరు శాతం ప్రాణం పోస్తారు. అలా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు.
గొప్ప కుటుంబంలో బిడ్డగా యాక్ట్ చేయాలన్నా.. నిరుపేద కుటుంబంలోని బిడ్డగా నటించాలన్నా.. ఓ కుటుంబాన్ని నడిపే కుటుంబ పెద్దగా అయినా.. ఇలా ఒకటా రెండా ఎన్నో పాత్రల్లో నటించి.. అలరించారు. అలాంటి ఎన్టీఆర్ ను షూటింగ్ పేరుతో ఒకరు కూర్చీతో రక్తం వచ్చేలా కొట్టారట. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. పాండురంగ మహత్యం మూవీ. ఇది పూర్తి పౌరాణిక సినిమా. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పుండరీక పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా నటుడు పేకేటి శివరాం ఎన్టీఆర్ ను కుర్చితో కొట్టే సీన్ ఉంది.
దీంతో ఈ సీన్ లో తాను యాక్ట్ చేయను అని తెగేసి చెప్పేశారట పేకేటి శివరాం. కానీ సినిమాల్లో ఇవన్నీ సహజమేనని.. అది కేవలం పాత్ర మాత్రమేనని ఎన్టీఆర్ గారే ఒప్పించి మరీ ఆయనతో యాక్ట్ చేపించారట. ఈ సీన్ లో పేకేటి శివరాం కొట్టడంతోనే ఎన్టీఆర్ వీపుకి దెబ్బ తగిలి రక్తం కారిందట. దీంతో పేకేటి శివరాం చాలా భయపడిపోయి షూటింగ్ ప్లేస్ నుండి పక్కకి వెళ్లిపోయి దాక్కున్నారట. దాంతో ఇవన్నీ కామన్ అని పేకేటి శివరాంతో ఎన్టీఆర్ మాట్లాడి ఆయనతో మాట్లాడి భయాన్ని తగ్గించారట.