Allu Arjun: భారతీయ సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే నేషనల్ అవార్డ్‌ని 2021 సంవత్సరానికి జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ దక్కించుకున్నారు. పుష్ఫ ది రైజ్ సినిమాలోని పుష్ప రాజ్ పాత్రలో అద్భుతంగా నటించినందుకు బన్నీకి ఈ అవార్డ్ దక్కింది. 69 ఏళ్ల జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఒక నటుడు జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం గెల్చుకోవడం ఇదే మొదటిసారి కావడంతో బన్నీపై ప్రశంసల వర్షం కురుస్తుంది. జాతీయ అవార్డుకు బన్నీ ఎంపికయ్యాడని ప్రకటించిన వెంటనే అతని ఇంట్లో సంబరాలు అంబరాన్నంటాయి. అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో పాటు, పుష్ప టీమ్ మొత్తం కూడా ఒకే చోట చేరి గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో మొత్తం ఏడు భాషలు పోటీ పడగా.. 30 సినిమాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అయితే తొలిసారి తెలుగు సినిమాలు పది అవార్డులను సొంతం చేసుకొని తెలుగోడి స్థాయిని పెంచాయి. ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా 6 అవార్డులను సొంతం చేసుకోగా, పుష్ప రెండు అవార్డులను దక్కించుకుంది. ఇక ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపిక కాగా ఆయనకు అవార్డుతో పాటు రూ.50 వేల ( రజత్ కమలం) ప్రోత్సాహక నగదును ప్రభుత్వం అందజేయనుంది. ఇక మిగతా జాతీయ అవార్డుల విజేతలకి సంబంధించిన నగదు బహుమతి వివరాలు ఇలా ఉన్నాయి.
⦁ ఉత్తమ నటి: అలియా భట్ (గంగూబాయి కాఠియావాడి), కృతిసనన్ (మీమీ) – రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ చిత్రం: రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్ (హిందీ) – స్వర్ణకమలం( దర్శక నిర్మాతలకు కలిపి రూ.2 లక్షల 50వేలు నగదు)
⦁ ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి -మరాఠీ) – స్వర్ణకమలం( దర్శక నిర్మాతలకు కలిపి రూ.2 లక్షల 50వేలు నగదు)
⦁ ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ది కశ్మీర్ ఫైల్స్-హిందీ) – రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠి (మిమి-హిందీ) – రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ యాక్షన్ డైరక్షన్: కింగ్ సాలమన్ (ఆర్ఆర్ఆర్) – రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్‌రక్షిత్ (ఆర్ఆర్ఆర్) – రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ గీత రచన: చంద్రబోస్ (కొండపొలం) – రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ స్క్రీన్‌ప్లే: నాయట్టు (మలయాళం) – రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ సంభాషణలు, అడాప్టెడ్: సంజయ్‌లీలా భన్సాలీ (గంగూబాయి కాఠియావాడి- హిందీ) – రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ సంభాషణలు, అడాప్టెడ్: సంజయ్‌లీలా భన్సాలీ (గంగూబాయి కాఠియావాడి- హిందీ)- రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ సినిమాటోగ్రఫీ: సర్దార్ ఉద్దమ్ (అవిక్ ముఖోపాధ్యాయ) — రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయఘోషల్ (ఇరివిన్ నిజాల్ – మాయావా ఛాయావా)- రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ నేపథ్య గాయకుడు: కాల భైరవ (ఆర్ఆర్ఆర్- కొమురం భీముడో)- రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ బాల నటుడు: భావిన్ రబారి (ఛల్లో షో-గుజరాతీ)- రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం :ఆర్ఆర్ఆర్ (రాజమౌళి)- స్వర్ణకమలం( దర్శక నిర్మాతలకు కలిపి రూ.2 లక్షల 50వేలు నగదు)
⦁ ఉత్తమ సంగీతం(పాటలు): దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప)- రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ సంగీతం(నేపథ్య): కీరవాణి (ఆర్ఆర్ఆర్)- రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ మేకప్: ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గంగూబాయి కాఠియావాడి)- రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ కాస్ట్యూమ్స్: వీర్ కపూర్ (సర్దార్ ఉద్దమ్)- రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: సర్దార్ ఉద్దమ్ (దిమిత్రి మలిచ్, మన్సి ధ్రువ్ మెహతా)- రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ ఎడిటింగ్: సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కాఠియావాడి)- రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమస్పెషల్ ఎఫెక్ట్స్: శ్రీనివాస మోహన్ (ఆర్ఆర్ఆర్)- రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనింగ్): అనీష్ బసు (చైవిట్టు-మలమాళం)- రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ ఆడియోగ్రఫీ (రీరికార్డింగ్): సినోయ్ జోసెఫ్ (ఝిల్లి డిస్కర్డ్స్- బెంగాలీ)- రజత్ కమలం (రూ.50వేల నగదు)