Pushpa: 69వ నేషనల్ అవార్డ్స్‌లో తెలుగు సినిమాలు సత్తా చాటిన విషయం తెలిసిందే. ఏకంగా పది నేషనల్ అవార్డులు గెలుచుకుంది. పుష్ప చిత్రానికి రెండు నేషనల్ అవార్డ్స్ రాగా, ఆర్ఆర్ఆర్ ఆరు దక్చించుకుంది. అయితే పుష్ప సినిమాలో అత్యుత్తమ నటన కనబరచిన బన్నీకి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ దక్కింది. దీంతో బన్నీ ఫ్యామిలీతో పాటు ఆయన అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. 69 ఏళ్ల జాతీయ చలన చిత్ర అవార్డుల హిస్టరీలో తొలిసారి ఓ తెలుగు హీరోకి నేషనల్ అవార్డ్ ఇదే తొలిసారి. పుష్ప సినిమాలో బన్నీ పుష్పరాజ్‌గా తన నట విశ్వరూపం చూపించడంతోనే ఆయనకి ఈ అవార్డ్ దక్కింది.
అంగవైకల్యం ఉన్న వ్యక్తిగా కనిపిస్తూనే మరోవైపు యాక్షన్ సీన్స్‌లోనూ బన్నీ అదరగొట్టాడు.ఫుష్ప చిత్రంలోని బన్నీ మేనరిజాన్ని విదేశీ క్రికెటర్స్ అనుకరించారంటే ఆ సినిమా ఎంత ప్రభావం చూపిందో అర్ధం చేసుకోవచ్చు. మైదానాల్లో తగ్గేదేలే అంటూ బన్నీ మ్యానరిజాన్ని ఇమిటేట్ చేయడం, ఆ సినిమాలోని పాటలకి డ్యాన్స్ చేయడం చూస్తే బన్నీ పాత్ర వారిపై ఎంత ఇంపాక్ట్ చూపించిందో అర్ధం అవుతుంది. బన్నీకి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు రావడం సరైన నిర్ణయమే అంటూ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినిమా ప్రేక్షకులు సైతం అంటున్నారు. అయితే ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్పరాజ్ పాత్రకి ముందు సుకుమార్.. బన్నీని అనుకోలేదట. తన మొదటి ఛాయిన్ బన్నీ కాదని సుకుమార్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.
మహేష్‌ని దృష్టిలో పెట్టుకొని కథ రాసుకున్న సుకుమార్ ఓ రోజు కథని ఆయనకి వినిపించాడట. కథ నచ్చిన మహేష్ బాబు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే మహేష్ గతంలో ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ వలన పుష్ప సినిమాకి డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడట. దీంతో ఆ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లింది. అయితే మహేశ్‌కు కథ చెప్పిన సమయంలో సుకుమార్ స్టోరీలైన్ కాస్త డిఫ్రెంట్‌గా ఉందని, మహేష్ మ్యానరిజాన్ని దృష్టిలో పెట్టుకొని స్టోరీ లైన్ కాస్త విభిన్నంగా ప్లాన్ చేసినట్టు సుకుమార్ తెలియజేశాడు. కాగా, మహేష్, సుకుమార్ కాంబినేషన్ లో ‘వన్ నేనొక్కడినే’ సినిమా రాగా, ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది.