Home Film News Khushi Movie Review: ఖుషి మూవీ రివ్యూ.. ఈ మూవీతో అయిన హిట్ కొట్టారా..!
Film News

Khushi Movie Review: ఖుషి మూవీ రివ్యూ.. ఈ మూవీతో అయిన హిట్ కొట్టారా..!

Khushi movie review: న‌టీనటులు:విజయ్ దేవరకొండ,సమంత,మురళీశర్మ,వెన్నెల కిషోర్,రాహుల్ రామకృష్ణ
దర్శకుడు: శివ నిర్వాణ
నిర్మాత: నవీన్, వై.రవిశంకర్
మ్యూజిక్: హేషం అబ్దుల్ వాహమ్
సినిమాటోగ్రఫీ: మురళి జి

ఇటీవ‌ల టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కి వినోదం క‌రువైంది. మంచి సినిమాల కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే నేడు ఖుషి సినిమా విడుద‌లైంది. ఈ చిత్రం  తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివనిర్వాన కథ రచన అందించారు.  కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో అందమైన ప్రేమ కథగా దీన్ని తీసుకువచ్చారు. విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, లక్ష్మీ, ఆలీ, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు న‌టించారు.

క‌థ‌:

విప్లవ్ (విజయ్ దేవరకొండ).. బేగం(సమంత)ను బురఖాలో మొదటిసారి చూసి ఆమెని తొలి చూపులోనే త‌న భాగ‌స్వామి అని ఫిక్స్ అవుతాడు. అయితే బ్రాహ్మ‌ణ కులానికి చెందిన ఆరాధ్య బేగంగా మారుతుంది. అయితే ఈ విష‌యం తెలుసుకున్న విప్ల‌వ్ ఆమె ప్రేమ‌ని ద‌క్కించుకునే ప్ర‌య‌త్నం చేస్తాడు. బేగం అత‌ని ప్రేమ‌ని యాక్సెప‌క్ట్ చేసిన  తండ్రి చంద్రరంగం (మురళీ శర్మ)అడ్డుపడుతాడు. ఎందుకంటే విప్లవ్ వాళ్లది నాస్తిక కుటుంబం. అంతేకాకుండా వీరిద్దరు పెళ్లి చేసుకుంటే కలిసి ఉండలేరని, వారి జాతకం అలా ఉండ‌ద‌ని పెద్ద‌లు భావిస్తారు. అయితే పెద్ద‌ల‌ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాక వీరి జీవితం ఎలా మారుతుంద‌నేది సినిమాలో ఆస‌క్తిగా చూపించారు

న‌టీన‌టులు ప‌ర్‌ఫార్మెన్స్:

విజయ్ దేవరకొండ తనలోని నటుడిని మరోసారి బయటపెట్టాడు. లైగర్ సినిమా తరువాత చాలా బాగా న‌టించి ఆక‌ట్టుకున్నాడు. గీత గోవిందంలో విజ‌య్ ఎలా సంద‌డి చేశాడో ఈ సినిమాలో కూడా అలానే అల‌రించాడు. ఇక స‌మంత బేగం పాత్ర‌లో మునిగిపోయింది.  కమెడియన్లు తమ ట్రాక్ లో అదరగొట్టారు. తండ్రి పాత్రలో మురళీశర్మ బాగా నటించారు. మిగతా వారు ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు.

టెక్నిక‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్

‘ఖుషి’మూవీలో లవ్ స్టోరీ కాన్సెప్ట్ కామనే అయినా దానిని చూపించడంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడు. ఇందులో ల‌వ్‌తో పాటు ఎమోష‌న్స్ బాగున్నాయి.హేషామ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ సినిమాకి ప్రాణం పోసింది. పాటలన్నీ బాగున్నాయి. పెయిన్ ఫుల్ లవ్ స్టోరీకి ప్రాణం పోసేది నేపథ్య సంగీతమే. ఈ సినిమాలో హేషామ్ అబ్దుల్ వహాబ్ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సన్నివేశాలను మరోస్థాయిలో నిలబెట్టింది. పాటలన్నింటికీ సాహిత్యం అందించి సింగిల్ కార్డ్ రైటర్‌గా మల్టీ టాలెంట్ చూపించారు దర్శకుడు శివ నిర్వాణ. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్:

విజయ్ దేవరకొండ, సమంత
మ్యూజిక్
సినిమాటోగ్రఫీ
లోకేషన్లు

మైనస్ పాయింట్స్
ఎడిటింగ్
కథనం

విశ్లేష‌ణ‌:

లవ్ ఫీలింగ్ తో పాటు ఎమోషనల్ తెప్పించే సినిమాగా ఖుషీ రూపొందింది. ఎక్కడా బోర్ కొట్టకుండా డీసెంట్ గా కథ రన్ చేశారు. ఫస్టాఫ్ లో ఆరాధ్య వెంట విప్లవ్ వెళ్లే సీన్స్ ఫీల్ గుడ్ మూవీ అనిపిస్తుంది.   సెకండాఫ్ లో 30 నిమిషాల పాటు ఎమోషనల్ సీన్స్ కన్నీళ్లు తెప్పిస్తాయి. అయితే ఈ సినిమా నిడివి పెద్దగా ఉండడం ప్రేక్షకులు ఇబ్బంది తెప్పించే అంశంగా రూపొందించారు. నార్మల్ లవ్ స్టోరీని ఎంటర్టైన్మెంట్ గా మలిచి డీసెంట్ గా తీర్చిదిద్దారు. ఒక‌సారి అయితే ఈ చిత్రాన్ని చూడొచ్చు.

రేటింగ్ 2.75/5

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...